top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।

అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀


🌻 411. 'శిష్టేష్టా’- 3 🌻


"ఆచారమున ధర్మము లేనప్పుడు ఆరాధన లెన్ని చేసిననూ దైవమునకు ప్రియులు కాలేరు.” 'శిష్టు' అనగా ధర్మాచార పరాయణులు. వీరికి చపలత్వముండదు. చపలత్వము కలవారు ముందుగ ఆచారమును సరిచేసు కొనవలెను. అందులకు ప్రార్థనలు చేయవచ్చును. కేవలము ప్రార్థనలే చేయుచు ఆచారమున మెరుగునకై ప్రయత్నింపనివారు కేవలము డంబాచారులై యుందురు. డంబాచారము అనాచారము కన్న హీనము. సదాచారులను రక్షించుట శ్రీమాత పని. వారామెకు ప్రియులు. వారి పూజలను ఆమె స్వీకరించును. వారికి శ్రియములే కాక ప్రియములు కూడ కలిగించును. అనగా మిక్కుటమగు వైభవమును కలిగించును. శివుని సాన్నిధ్యమును కూడ కల్పించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita

Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻


🌻 411. 'Sishteshta'- 3 🌻


'When there is no dharma in practice, even if you do worship, you will not be loved by God.' 'Sishtu' means the practitioners of dharma. They have no fickle mindeness. Those who are fickle should correct their dharmic practices. Prayer helps for that. Those who only pray and do not try to improve their practices are just hypocrites. Hypocrisy is worse than ignorance. Srimata's job is to protect the righteous. They are Her loved ones. She accepts their worship. It not only makes them prosper but also makes them happy. That is, She grants more glory in their life. She also brings them closer to Lord Shiva.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page