🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 413 / Sri Lalitha Chaitanya Vijnanam - 413 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀
🌻 413. ‘అప్రమేయా’🌻
కొలతలకు అందనిది శ్రీమాత అని అర్థము. ఆకాశమును కొలుచుటకు సాధ్యపడదు. అట్లే శుద్ధ చైతన్యమగు శ్రీమాత మొత్తము తెలియుట సాధ్యము కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతము శ్రీమాత పారము తెలిసినవారు కారు. అపరిమితమై వ్యాపించిన వెలుగు నందు ఏర్పడిన అణువులవంటి వారు జీవులు. ఆమె కొలతలు సృష్టిని అతిక్రమించి యుండును. సృష్టిలోనివారు ఇక ఎట్లు కొలువగలరు? సృష్టికి పరము ఆమెయే. ఆమెకు పరము లేదు కనుక ఆమె మొత్తముగా తెలియుట ఎవ్వరికినీ సాధ్యము కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 413 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻
🌻 413. 'Aprameya'🌻
It means Srimata is immeasurable. It is not possible to measure the sky. It is not possible to know the whole of pure consciousness of Srimata. Lord Brahma, Vishnu, Maheshwar also do not know the limits Srimata. Life is like small atoms suspended in the unlimited consciousness. Her dimensions transcend creation. How can those in creation measure Her? She is the one beyond creation. It is not possible for anyone to know her as a whole because she has no limit.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments