🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 415 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 415 -1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀
🌻 415 'మనోవాచామగోచరా’ - 1🌻
మనస్సునకు, వాక్కునకు గోచరము కానిది శ్రీమాత అని అర్థము. మనస్సుచేత పూర్ణముగ ఊహింపబడునది, వాక్కుచేత సంపూర్ణముగ ప్రకటింపబడునది శ్రీమాత. మనస్సుతో గాని, కన్నుతోగాని, చెవితోగాని, స్పర్శతోగాని, సుగంధ స్పర్శతోగాని, రుచితోగాని శ్రీమాతను లేశమాత్రము అనుభూతి చెందవచ్చును. మనస్సు, ఇంద్రియములు ఇత్యాదివి పరిమితములు. అట్టి వానిద్వారా అపరిమితమగు తత్త్వము ఎట్లు తెలియగలము. కాని తెలియు ప్రయత్నము చేయుచున్నచో మనస్సు, ఇంద్రియములు అపరిమిత తత్త్వమునకు ఉన్ముఖమై క్రమముగ అనుభూతి వృద్ధి యగుచుండును. అవగాహన పెరుగుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 415 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Prasad Bharadwaj
🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻
🌻 415 'Manovachamagochara' - 1🌻
Srimata means that which is incomprehensible to mind and speech. Sri Mata cannot be fully conceived by the mind and cannot be fully revealed by speech. With the mind, with the eye, with the ear, with the touch, with the aromatic odour, with the taste, one can only feel a sliver of Srimata for mind and senses are limited and one cannot comprehend the infinite with finite mind. But if you try to know, the mind and the senses will be exposed to the unlimited philosophy and the comprehension will grow gradually. Awareness will increase.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments