🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 415 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 415 -2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀
🌻 415 'మనోవాచామగోచరా’ - 2🌻
తెలియు ప్రయత్నము చేయుచున్నచో ఆనందము హెచ్చగు చుండును. మనో యింద్రియములు పరిశుద్ధత చెందుచు యుండును. అపుడు కూడ మొత్తము తెలియుట వీలుపడదు. తెలియ చెప్పుటకు అసలే వీలుపడదు. కాని ఈ మార్గమున మనో యింద్రియము లందు స్థితిగొన్న మానవ ప్రజ్ఞ క్రమముగ వికాసము చెందుచు దివ్య ప్రజ్ఞలోనికి ప్రవేశించును. అపుడు కూడ అంతయూ తెలియదు. తాను, నేను అను ప్రజ్ఞ కలిగినపుడు తా నుండక పరముండును. అట్టివారు మరల తానుగ, నేనుగ మేల్కాంచి నపుడు పరిశుద్ధులగుటచే శ్రీమాతను గూర్చి తెలుపగలిగిన వారగుదురు. అపుడు కూడ ఆ తెలుపుట పరిమితమే. అట్టివారు శ్రీమాత స్పర్శకు వాహికలై యుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 415 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻
🌻 415 'Manovachamagochara' - 2🌻
If you are making an effort to know, your happiness will rise. The senses will be purified. Even then it is not possible to know the whole. It is even impossible to teach. But in this way the human wisdom that is in the mind gradually develops and enters the divine wisdom. Even then, the whole can't be known. When one has the knowledge of self and the non self, then divine becomes the self. When the divine self becomes the personality self, they are purified and hence they know Srimata. Even then that knowing is limited. They shall carry the blessings of Sri Mata.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments