top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 416 -3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 416 -3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀


🌻 416. ‘చిచ్ఛక్తి’ - 3🌻


శ్రీమాత చిత్శ్శక్తి నెరిగిన జ్ఞానేశ్వరుడు ప్రతిష్ఠానపురమున పండితులగు సభికుల నడుమ గోముఖము నుండి వేదములను పలికించెను. జ్ఞానేశ్వరుడు రూపు కట్టుకొని వచ్చిన జ్ఞానము. అతడు ఈశ్వరుడు అగుటచేత గోవు నందలి చిత్ శక్తికి ప్రేరణ కలిగించి వేదములను ఉచ్చరింపజేసెను. జంతువులు యందుకూడ చితశక్తి యుండునని తెలుపు తార్కాణమిది. అట్లే వృక్షములు మాటలాడుట, శిలలు సందేశమిచ్చుట, పక్షులు పలుకుట- ఇత్యాది వన్నియూ సంభవములే. అసంభవ మనునది అమ్మ చిత్ శక్తికి లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 416 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika

Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻


🌻 416. 'Chichhakti' - 3🌻


Srimata Chitshakti was blessed in Gnaneshwar who recited the Vedas from the gomukha in the midst of a gathering of scholars at Pratishthanapuram. Gnana is the form of Gnyaneshwar. He, being the lord, inspired the Chit Shakti in the cow and recited the Vedas. This proves that animals also have Chitshakthi. Trees talking, sculptures sending messages, birds speaking- these are all similar phenomena. Amma ChitShakti does not have the impossibility.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

コメント


Post: Blog2 Post
bottom of page