top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀


🌻 420. 'గాయత్రీ' - 2🌻


ఈ వెలుగును భక్తిశ్రద్ధలతో ఆరాధించువారు ఛందో రూప మైనటువంటి సృష్టిని తెలియగలరు. నేడు వాడుకలో నున్న గాయత్రి మంత్రమును దర్శించి జాతికి అందించిన విశ్వామిత్ర మహర్షిని ఆరాధించి, గాయత్రి మాతను గానము చేయుట వలన మంత్రసిద్ధి కలుగ గలదు. ఎంతగానము చేసిన అంత రక్షణ నిచ్చునది గాయత్రి.


వేదమాత యగుటచే గానము, ధ్యానము చేసిన వారికి జ్ఞాన వికాసము కలిగించునది గాయత్రి. అట్లే జీవితమును గమ్యము వైపునకు నడిపించు టకు వలసిన బుద్ధి ప్రచోదనము కలిగించునది గాయత్రి. గాయత్రి వేదమాత. ఆమెయే సృష్టి సంకల్పము. ఆమె చతుర్ముఖు డగు బ్రహ్మ యందు భాసించినపుడు, చతుర్ముఖునికి సృష్టి జ్ఞానము కలుగును. ఈ సంకల్పమే లేనపుడు సృష్టియే లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika

Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻


🌻 420. 'Gayatri' - 2🌻


Those who worship this light with devotion can know creation in its harmony. Offering salutations to sage Vishvamitra who gave the Gayatri Mantra which is in use today and chanting it shall prove fruitful. Gayatri is the one who gives as much protection as to your chanting.


Gayatri, being the mother of all Vedas, gives wisdom to all those who chant and meditate. It is Gayatri that inspires the mind to lead one's life towards one's goal. Gayatri is the mother of all Vedas. She is the will of creation. When she manifests in the four-faced Brahma, He gets the knowledge of creation. Without this will, there is no creation.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page