top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀


🌻 420. 'గాయత్రీ' - 3🌻


సంకల్పమే లేనపుడు సృష్టికర్త కూడ లేడు. ప్రకృతి పురుషులు కూడ లేరు. తత్త్వమే యుండును. అందుండి పుట్టు మొట్టమొదటి సృష్టి స్ఫురణ సృష్టికి కారణభూతము. సంకల్పమే లేనపుడు క్రియ కూడ లేదు. ఇచ్ఛా, జ్ఞాన క్రియలు లేవు. తత్త్వము యొక్క ప్రథమ వ్యక్తరూపము గాయత్రి అని తెలియవలెను. ఆమె సంకల్పములకు తల్లి, పుట్టుచోటు. ఎవ్వరికైనను సంకల్పము కలిగిన పిదపనే అందుండి ఇచ్ఛా జ్ఞాన క్రియలు పుట్టును.


సంకల్పమే కలుగనిచో స్థబ్దుగ నుందురు. స్థబ్దత రెండు రకములు. ఒకటి సమాధి, రెండు జడము. ఇందు మొదటివారు సంకల్పమును దాటి తత్త్వమున నిలచినవారు. రెండవ వారు అతి మంద్రస్థాయిలో మాత్రమే సంకల్పము పనిచేయు స్థబ్ధులు. సమాధి యందుండు యోగేశ్వరులు మొదలుగ స్థబ్దుల వరకు అందరిని, అన్నింటిని నడిపించునది సంకల్పమే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 3 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Prasad Bharadwaj


🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika

Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻


🌻 420. 'Gayatri' - 3 🌻


When there is no will there is no creator. Not even nature and consciousness. There is only philosophy. The idea of creation that arose from it was the cause of creation. When there is no will there is no action. There are no will, wisdom and action. It should be known that the first manifestation of Tattva(philosophy) is Gayatri. She is the mother and birthplace of will. It is only from the will do intention, knowledge and action are born.


If there is no will, you will be stagnant. Stagnation is of two types. One is samadhi, other is inertia. The first of these are those who go beyond will and stand in philosophy. Second, they are the weaklings whose will works only at the lowest level. Sankalpa is what drives everyone and everything, from the yogis in samadhi to the laziest of people.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page