🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 420 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 4 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀
🌻 420. 'గాయత్రీ' - 4🌻
కోటాను కోట్ల జీవులు కోటానుకోట్ల విధములుగ లేచినది మొదలు నిద్రపోవు వరకు తీరుబడి లేక తిరుగాడు చుందురు. వారియందు సంకల్పములట్లు పుట్టుచునే యుండును. సంకల్పము పుట్టిన వెనుక దాని ననుసరించి పరుగిడుటయే యుండును గాని సంకల్పములు పుట్టు చోటును గమనించువారు బహు కొద్ది. అట్లు గమనించు ప్రయత్నమే గాయత్రి మాతను దర్శించు ప్రయత్నము. ఆ ప్రయత్నమున ధీశక్తి పెరుగును. తత్కారణముగనే గాయత్రి గానము, ధ్యానము, జపము ధీశక్తిని పెంచునని పెద్దలు తెలుపుదురు. సృష్టికర్తకు నాలుగు వేదముల సారముగ సృష్టి జ్ఞానము కలిగించినది గాయత్రి. ఆమెయే వేదమాత. (గాయత్రి మాతను గూర్చిన వ్యాఖ్యానములు అనేకానేకములు గలవు. ఆమె రూప వర్ణము కూడ తత్త్వమే. విశేష వివరణములకు “గాయత్రి మంత్రము - అవగాహన” వ్యాఖ్యానము పరిశీలించుకొన వచ్చును.)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 420 - 4 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻
🌻 420. 'Gayatri' - 4 🌻
Millions of billions of living beings move around from waking up to falling asleep. Desires keep on taking birth in them. People run after their desires, but very few people observe the place where the it is born. Such an attempt to observe is an attempt to invoke Mata Gayatri. Dhishakti will increase in that effort. Elders say that Gayatri chanting, meditation and chanting will instantly increase Dhishakti. It was Gayatri who imparted the essence of the four Vedas to the Creator. She is the Veda Mata. (There are many interpretations about Mata Gayatri. Her form is also a philosophy. For special explanations, you can check the commentary 'Gayatri Mantra - Understanding'.)
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments