🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 421 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 421 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀
🌻 421. 'వ్యాహృతి' - 1🌻
ఉచ్చారణమున పుట్టునది శ్రీమాత అని అర్థము. సంకల్పము పరము నుండి కలిగినపుడు పశ్యంతి అగుచున్నది. భాష రూపమును దాల్చినపుడు మధ్యమ అగుచున్నది. ముఖము నుండి ఉచ్చరింపబడినపుడు వైఖరి యగుచున్నది. పరాస్థితి నుండి మూడు దశలలో వాక్కు ఉచ్చరింపబడు చున్నది. ఈ మూడు స్థితులను కలిపి ఉచ్చారణ అందురు. అట్లు పరావాక్కు గుహా ముఖము నుండి ఉచ్చరింపబడి వెలుగై నిలచును. గుహా ముఖ మనగా రహస్యమగు మార్గమునకు ద్వారము. ముఖద్వారమే గుహాముఖము. అవ్యక్తము నుండి వ్యక్తము లోనికిట్లు నిత్యము పరావాక్కు నిశ్వాస మార్గమున ఉచ్చరింపబడుచునే యున్నది. సృష్టి జరుగుచునే యున్నది. ఉచ్చ్వాస మార్గమున మరల ఉపసంహరింప బడుచునే యున్నది. ఈ నడుమ సృష్టి యున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 421 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻
🌻 421. 'Vyahrti' - 1🌻
What is born of the utterance is Srimata. When the will is from the Divine, Pasyanti is formed. When language takes form, it forms Madhyama. Vaikhari is formed when language is pronounced from the face. The speech is uttered in three stages from the Divine state. These three states are combined to form an utterance. Thus Paravakku is uttered from the secret cave and shines as light. The secret cave is the door to the secret path. The entrance itself is the secret cave. Paravakku is constantly being uttered through the breath from the unmanifest to the manifest. Creation is constantly happening. Retraction into the Divine continues to happen. This utterance from and retraction into the Divine keep on happening like inspiration and expiration. There is creation in the midst of this.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments