top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀


🌻 422. 'సంధ్యా' - 2🌻


రాశుల నడుమ యున్నది. అయనముల నడుమ నున్నది. శ్వాసకు శ్వాసకు నడుమ, భావమునకు భావమునకు మధ్య కూడ సంధ్య యున్నది. ఇట్టి సంధ్యలను గమనించుచూ వానిని ధ్యానించి నపుడు జీవుడు యోగస్థితి చెందగలడు. సంధ్యాకాలమున ఆరాధనములు అత్యున్నత స్థితిని కలిగించ గలవు. ఆ కారణముగనే వేదఋషులు సంధ్యావందనము నేర్పరచి నారు. ఉదయ సంధ్య, సాయం సంధ్య సమయములలో శుచియై ఆరాధించు వారిని సంధ్యాదేవి యగు శ్రీమాత విశేషముగ సాన్నిధ్యమిచ్చి అనుగ్రహించ గలదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika

Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻


🌻 422. 'Sandhya' - 2🌻


She is between the constellations. She is between the suns. She is there in the gap between breath and breath, and between feeling and feeling. By meditating on these twilight zones, the living being can attain the state of yoga. Devotionals at dusk can induce a state of exaltation. That is the reason why Vedic sages taught Sandhyavandana( salutations at dusk) Goddess Srimata shall bless those who worship with purity in the morning and in the evening .



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

コメント


Post: Blog2 Post
bottom of page