top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 4


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 4 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।

గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀


🌻 422. 'సంధ్యా' - 4🌻


సంధ్యను ఎన్నడునూ మరువకుడు. ఇప్పుడు కూడ సంధ్యావందనమును గావించి పాంచాలమునకు సాగుడు. మీకు స్వయంవరము శుభప్రదమగుగాక!" అని ఆశీర్వదించెను. భారతమున ఈ యుదంతమును పేర్కొని వేదవ్యాస మహర్షి సాయం సంధ్య ప్రాశస్త్యము తెలిపినాడు. సాయం సంధ్య కూడ ప్రాధాన్యము వహించి యున్నదని, కేవలము ప్రాతః సంధ్య మాత్రమే పాటించుట పరిపుష్టి నియ్యదని తెలిపినాడు. ఉభయ సంధ్యల యందు సంధ్యకు, సావిత్రికి, గాయత్రికి శుచియై అర్ఘ్యము నిచ్చుట ఉత్తమ సంస్కారము. కాలవైపరీత్యము వలన సంప్రదాయ కుటుంబముల యందు కూడ ఇది మరచుట జరుగుచున్నది. శ్రేష్ఠమగు జీవితములు సాగవలెనన్నచో ఉభయ సంధ్యలయందు ఆరాధనమును పాటించ వలెను.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 4 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika

Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻


🌻 422. 'Sandhya' - 4🌻


Never forget Sandhya. Even now, after performing the dusk rituals, go to Panchala. He blessed "May your Swayamvara be blessed!". Vedavyasa Maharishi emphasised the importance of dusk rituals through this example. He said that evening rituals should also be given priority and it is not sufficient to observe only morning rituals. The best rites are to offer clean arghya to Sandhya, Savitri and Gayatri on both twilights. In course of time, this is being forgotten even in traditional families. If you want to live a good life, you should worship in both morning and evening.

Continues... 🌹 🌹 🌹 🌹 🌹

コメント


Post: Blog2 Post
bottom of page