🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 423 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀
🌻 423. 'ద్విజబృంద నిషేవితా' - 2🌻
ఆరాధన మార్గమున వెలుగునందు స్థిరపడిననూ వారా వెలుగులకు మూలమైన శ్రీమాతను ఆరాధించుచునే యుందురు. అట్టి వారి ఆరాధన విశేషమగు ఆరాధన. అట్టి ద్విజులు సామూహికముగ శ్రీమాతను ఆరాధనము చేసినపుడు ఆమె సాన్నిధ్యము అచ్చట నిశ్చయముగ నుండును. కారణము శ్రీమాతకు వారియందు గల అశేష ప్రీతి.
అజ్ఞానులు ఆరాధించిననూ శ్రీమాత ప్రీతి చెందును. జ్ఞానులు, సిద్దులు, యోగులు ఆరాధించినపుడు విశేషముగ ప్రీతి చెందును. ఇట్టివారు బృందములుగ నేర్పడి ఆరాధించుట అత్యంత విశేషమైన కార్యము. శ్రీమాత అట్టి పూజల యందు విశేషముగ అవతరించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻
🌻 423. 'Dwijabrinda Nishevita' - 2🌻
On the path of worship, though established in the light, they continue to worship Sri Mata, the source of light. That worship is a special worship. When such a group worships Srimata, her presence is certain. The reason is the eternal love of Srimata towards them.
Sri Mata is pleased to be worshiped even by the ignorant. But when worshiped by sages, siddhis and yogis, She is highly pleased. It is a very special thing to worship as a group. Sri Mata's special incarnation happens in such Worships.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentários