🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 424 / Sri Lalitha Chaitanya Vijnanam - 424 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥🍀
🌻 424. 'తత్త్యాసనా' 🌻
తత్త్వమే ఆసనముగా గలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత శివునితో గూడి తత్త్వము నధిష్ఠించి యుండును. ఆమె అర్ధనారి. అతడు అర్ధనారీశ్వరుడు. ప్రకృతి పురుషుడు నిరువురునూ కలసి సృష్టియందు ఈశ్వరత్వము వహింతురు. సృష్టిని అధిష్ఠించి యుందురు. వారు సహజముగ నుండు స్థితి తత్. అదియే వారి ఆసనము. అక్కడనుండియే వారు సర్వలోకములకు వ్యాపింతురు. సర్వము నందు నిండి యుందురు. ఉత్కృష్టమగు యోగులకు సహస్రారమున ఈ అనుభూతి యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 424 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91🌻
🌻 424. 'Tattyasana' 🌻
It means that Sri Mata is seated in Wisdom (Tattva). She along with Lord Shiva preside over the Principles of Wisdom. She is Ardhanari. He is Ardhanarishwar. She and Shiva, as Nature and consciousness preside over the Lordship of the creation. They are exalting the creation. Tat is their natural state of being. That is their seat. From there they are omnipresent in all the worlds. Everything is filled with Them. Great yogis experience this feeling in the Great Lotus chakra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments