🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥🍀
🌻 425. 'తత్త్వమయీ’ - 1🌻
తత్త్వమే తానుగా నున్నది శ్రీమాత అని అర్థము. 'తత్త్వ మనగా తత్ అనెడి పురుష, ప్రకృతుల సమాగమ ప్రజ్ఞ. అదే శాశ్వత సత్యము. అది అనిర్వచనీయమైనది. అనన్య మగుటచే దానిని గూర్చి తెలుపుట అసాధ్యము. మరొకరు లేని స్థితి యందు అది ఎట్లు వున్నదో తెలుపుట ఎట్లు సాధ్యము? శ్రీమాత అట్టి తత్త్వము.
ఆ తత్త్వముతో అనుసంధానము చెందుట ధ్యానము యొక్క పరమావధి. అనుసంధానము జరుగుచున్న సందర్భమున ధ్యానము చేయువాడు ఆ తత్త్వము లోనికి ఆకర్షింపబడి తా నుండక తత్త్వమే యుండును. అట్టి స్థితిని చేరుటకే శ్రీమాత ఆరాధనము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91🌻
🌻 425. 'Tattvamayi' - 1🌻 Srimata itself is wisdom (tattva). The meaning of Tattva(Wisdom) is the amalgamation of Nature and Consciousness in equilibrium. It is the divine knowledge ( Pragnya). That is the eternal truth. It is indefinable. It is impossible to tell about it due to its uniqueness. How is it possible to express what it is in the absence of another? Srimata is such philosophy. Connecting with that philosophy is the ultimate meditation. When the connection is taking place, the meditator is drawn into that Tattva and becomes Tattva without himself. To reach such a state is the worship of Srimata. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comments