🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀
🌻 425. 'తత్త్వమయీ’ - 2🌻
ఆమె మహిమలను, విభూతులను అనేకానేక నామమలతో వర్ణించుచు, కీర్తించుచూ ఆరాధన చేయు సమయమున ఆరాధకుడు తన్మయము చెందును. తన్మయము చెందినపుడు తా నుండడు. మరల సముద్రము నుండి అలవలె తాను తనకు జ్ఞప్తికి రాగా, తన్మయ స్థితి యొక్క మాధుర్యమును కించిన్మాత్రము రుచి తెలియుట వలన దానినే కోరుచు జీవించును. అట్టివా డెట్టి కార్యముల యందున్ననూ అందు తత్త్వమునే దర్శించును. దానితో అనుసంధానము చెందుచూ జీవితమును రసోపేతముగ నిర్వర్తించుకొను చుండును. శ్రీమాత తత్త్వమయీ, ఆమె తత్ స్థితిలోనే యుండును. శివునితో విడిపడనిది, విడదీయ రానిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻
🌻 425. 'Tattvamayi' - 2 🌻
The worshiper is awestruck at the time of praising and describing her glories and virtues with many names. He is not there when he is in bliss. And when he remembers himself like a wave from the sea, he lives longing for the sweetness of his own state. Such aspirant always sees philosophy in all these actions. By connecting with it, he will live his life. Srimata is the deitification of philosophy, Tattvamayi, and she remains in the state of Tattva. Inseparable from Shiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments