top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 426 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।

నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀


🌻 426. 'పంచకోశాంతర స్థితా' - 1🌻


పంచకోశముల యందు వసించునది శ్రీమాత అని అర్థము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములుగ పంచకోశము లున్నవి. ఈ పంచకోశములును పంచభూతములతో నిర్మించబడినవి. ఇందు పంచతత్త్వములతో శ్రీమాత వసించి యున్నది. ఆకాశ గుణము, వాయు గుణము, అగ్ని తేజము, నీటి గుణము, పృథివీ గుణములు శ్రీమాత అస్థిత్వ కారణముగనే యేర్పడు చున్నవి.


పృథివికి గంధము, నీటికి రుచి, అగ్నికి తేజస్సు, వాయువునకు స్పర్శ, ఆకాశమునకు శబ్దము అను గుణములు యున్నవి. వీని యందు శ్రీమాతను దర్శించుట వలన పంచభూతములు, పంచ కోశముల ద్వారా ఆనందము కలిగించగలవు. ఈ కోశములు అపరిశుద్ధముగ నున్నచో ఆనంద ముండదు. పరిశుద్ధముగ నున్నప్పుడు ఒక దానిని మించి మరియొకటి ఆనందమిచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 426 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️ Prasad Bharadwaj


🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita

Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻


🌻 426. 'Panchakoshantarah Stitha' - 1🌻


It means Srimata who resides in Panchakoshams. Panchakosha consists of Annamaya, Pranamaya, Manomaya, Vijnanamaya and Anandamaya koshams. These panchakoshams are made up of panchabhutas. Sri Mata is residing here with Panchatattvam. Akasha Guna, Vayu Guna, Agni Teja, Water Guna and Earthly Guna are the causes of existence of Sri Mata.


Earth has sent, water has taste, fire has radiance, air has touch, sky has sound. Darshan of Sri Mata can bring happiness through panchabhutas and pancha koshams. If these koshams are impure, there is no happiness. When there is purity, one thing surpasses the other in giving Happiness.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page