🌹 03, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
🌹. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీకు మరియు అందరికి Good Wishes On Guru pournami to you and All 🌹
🍀. విశ్వగురువు మరియు అఖండ గురుసత్తా యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీదా ఉండాలని, మనమందరం సత్య ధర్మములకు ప్రతీకగా నిలబడే శక్తిని గురు చైతన్యం మనలో ప్రేరేపించాలని ప్రార్థనతో సర్వస్వ శరణాగతి గురుపాదార విందములకు.......🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : గురుపౌర్ణమి, వ్యాసపూజ, Guru Purnima, Vyasa Puja 🌻
🍀. శ్రీ గురు ప్రార్థనా స్తోత్రం 🍀
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక: అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ:
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : తెర తొలగాలంటే - తొలుత సాధకుడే భగవానుని అన్వేషించాలి, ప్రేమించాలి, అన్వేషణను కొనసాగిస్తూ భగవానుని కొరకు ఉద్విగ్న హృదయుడు కావాలి. ఆది జరిగినప్పుడే, తెర ప్రక్కకు తొలగుతుంది, వెలుగు ద్యోతకమవుతుంది. ధగన్ముఖారవింద దర్శనమై మరుభూమి యందింత కాలమూ సంచరించు చుండిన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. 🍀
🌻. గురుపౌర్ణమి విశిష్టత 🌻
ఆషాఢ శుధ్ధపూర్ణిమను గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఙ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతఙ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురు దర్శనానికి, స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. మానవుల మనసులో అష్టమదాలూ, అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి.
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: పూర్ణిమ 17:09:49 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: మూల 11:02:48 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: బ్రహ్మ 15:45:18 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: విష్టి 06:47:29 వరకు
వర్జ్యం: 19:35:36 - 21:01:12
దుర్ముహూర్తం: 12:46:30 - 13:39:05
మరియు 15:24:15 - 16:16:51
రాహు కాలం: 07:24:24 - 09:03:00
గుళిక కాలం: 13:58:48 - 15:37:24
యమ గండం: 10:41:36 - 12:20:12
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 05:14:32 - 06:41:24
మరియు 28:09:12 - 29:34:48
సూర్యోదయం: 05:45:48
సూర్యాస్తమయం: 18:54:36
చంద్రోదయం: 19:05:37
చంద్రాస్తమయం: 05:11:52
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 11:02:48 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Kommentit