11 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము
- Prasad Bharadwaj
- Mar 11, 2023
- 1 min read

🌹 11, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 10 🍀
17. నమో మహాభైరవాయ శ్రీరూపాయ నమో నమః |
ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః
18. నమః ప్రసన్నరూపాయ హ్యాదిదేవాయ తే నమః |
నమస్తే మంత్రరూపాయ నమస్తే రత్నరూపిణే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాహ్యపరిస్థితులు : ధ్యానసాధన
విజనస్థలం, ఏకాంతవాసం, నిశ్చలాసనం, ఇవి ధ్యానం చేసేటప్పుడు సాధకునికి ప్రారంభ దశలో సహాయకములే. కానీ, వీటికి అతడు బద్ధుడై పోరాదు. ధ్యానం అలవాటైన పిమ్మట, అన్ని పరిస్థితులలోను, అనగా పడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఒంటరిగా వున్నా, పది మందిలో ఉన్నా, సద్దు మణిగి ఉన్నా, రేగినా అతడు ధ్యానం చేయగలిగి వుండాలి. 🍀
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ చవితి 22:07:01 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: చిత్ర 07:11:30 వరకు
తదుపరి స్వాతి
యోగం: ధృవ 19:51:41 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బవ 09:56:06 వరకు
వర్జ్యం: 12:58:26 - 14:37:42
దుర్ముహూర్తం: 08:03:12 - 08:51:02
రాహు కాలం: 09:26:54 - 10:56:35
గుళిక కాలం: 06:27:32 - 07:57:13
యమ గండం: 13:55:56 - 15:25:37
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 00:27:32 - 02:08:24
మరియు 22:54:02 - 24:33:18
సూర్యోదయం: 06:27:32
సూర్యాస్తమయం: 18:24:59
చంద్రోదయం: 21:43:40
చంద్రాస్తమయం: 08:44:54
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: కాల యోగం - అవమానం
07:11:30 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments