🌹 21, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఫాల్గుణ అమావాస్య, వసంత విషువత్తు (వసంతకాలం మొదటి రోజు లేదా మేషపు తొలి బిందువు), Chaitra Amavasya
Vernal Equinox🌻
🍀. అపరాజితా స్తోత్రం - 10 🍀
21. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
22. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి :
ధ్యానసాధనలో చైతన్య ప్రవృత్తి - ధ్యానసాధనలో చైతన్యం ఒక స్థానమందు కేంద్రీకృత మైనప్పుడు, ఇతర స్థానములందలి చైతన్యం మూగవోయి వుంటుంది. లేక, ఆలోచనలు మొదలైనవి బయట ఎక్కడనో కదలాడినట్లుండి కేంద్రీకృతమైన భాగం దానిని గుర్తించని స్థితిలో ఉంటుంది. ధ్యానం విజయవంతమైనట్లు చెప్పు కోదగినప్పటి పరిస్థితి అది. 🍀
🪷 🪷 🪷 🪷 🪷
🌴. వసంత విషువత్తు (వెర్నల్ ఈక్వినాక్స్) అంటే : 🌴
భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్ష్య తలానికి లంబంగా కాక 23.4° కోణంలో వాలుగా ఉంటుంది. అంటే భూమి కక్ష్యా తలం, జ్యోతిశ్చక్ర (ఎక్లిప్టిక్) తలానికి 23.4° కోణంలో ఉంటుంది. భూమధ్య రేఖను ఖగోళానికి పొడిగిస్తే ఆ ఖగోళ మధ్య రేఖ జ్యోతిశ్చక్రాన్ని రెండు స్థానాల వద్ద ఖండిస్తుంది. వీటినే విషువత్తులు అంటారు. ఇంగ్లీషులో ఈక్వినాక్స్ అంటారు. జ్యోతిశ్చక్రం వెంట ప్రయాణిస్తున్నట్లుగా కనిపించే సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖను ఈ విషువత్తుల వద్దనే దాటుతాడు. సంవత్సరంలో ఇది రెండు సార్లు జరుగుతుంది. దక్షిణం నుండి ఉత్తర దిశగా దాటే బిందువును వసంత విషువత్తు (వెర్నల్ ఈక్వినాక్స్) అని అంటారు. ఉత్తరం నుండి దక్షిణానికి దాటే బిందువును శరద్ విషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) అనీ అంటారు. వసంత విషువత్తును జ్యోతిశ్చక్రపు ఎసెండింగ్ నోడ్ అని, మేషపు తొలి బిందువు అనీ కూడా అంటారు. అలాగే శరద్ విషువత్తును డిసెండింగ్ నోడ్ అని అంటారు. సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజుల్లో (మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రీ, పగళ్ళ నిడివి సమానంగా ఉంటుంది. ఇవి రెండు రకాలు వసంత విషువత్తు (మార్చిలో), శరత్ విషువత్తు (సెప్టెంబరులో).
🪷. ఆయనము : విషువత్తుల మధ్య కాలాన్ని ఆయనము అంటారు. ఇవి ఉత్తరాయనము, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి.
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం
తిథి: అమావాశ్య 22:54:02 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: పూర్వాభద్రపద 17:27:37
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: శుభ 12:40:58 వరకు
తదుపరి శుక్ల
కరణం: చతుష్పద 12:20:33 వరకు
వర్జ్యం: 01:28:16 - 02:55:20
మరియు 26:16:48 - 27:45:16
దుర్ముహూర్తం: 08:45:16 - 09:33:45
రాహు కాలం: 15:25:16 - 16:56:11
గుళిక కాలం: 12:23:27 - 13:54:22
యమ గండం: 09:21:38 - 10:52:32
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 10:10:40 - 11:37:44
సూర్యోదయం: 06:19:49
సూర్యాస్తమయం: 18:27:05
చంద్రోదయం: 06:03:28
చంద్రాస్తమయం: 18:13:18
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: కాల యోగం - అవమానం
17:27:37 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comentários