🌹 22, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
🍀. 'శ్రీ శోభకృత్' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌺. పండుగలు మరియు పర్వదినాలు : 'శ్రీ శోభకృత్' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు, Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri 🌺
🍀. శ్రీ గణేశ హృదయం - 14 🍀
15. మాతాపితాఽయం జగతాం పరేషాం
తస్యాపి మాతాజనకాదికం న |
శ్రేష్ఠం వదంతి నిగమాః పరేశం
తం జ్యేష్ఠరాజం ప్రణమామి నిత్యమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అలసట రానివ్వరాదు - చైతన్యాన్ని ఏకత్ర కేంద్రీకృతం చెయ్యడమనే అభ్యాసం ప్రారంభ దశలో దీర్ఘకాలం చెయ్యరాదు. అలా చేస్తే అలసట వలన సాధన నిష్ప్రయోజనమై పోతుంది. అలసట కలిగేటట్లు ఉన్నప్పుడు చైతన్య కేంద్రీకరణాభ్యాసం విరమించి దానికి బదులు మామూలు ధ్యానం చెయ్యవచ్చు. 🍀
🪷 🪷 🪷 🪷 🪷
🌻. 'శోభకృత్' నామ సంవత్సరానికి స్వాగతం. భగవంతుడు తన ప్రేమపూర్వక సృష్టిలో ఈ ప్రపంచాన్ని యుగాది నాడు సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలి ఆకాంక్షిస్తూ, ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. 🌻
🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹
సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |
శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్
🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :
1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం
2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు"
🌴. ఉగాది విశిష్టత : 🌴
‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.
ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.
🌷🌷🌷🌷🌷
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల పాడ్యమి 20:22:58
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: ఉత్తరాభద్రపద 15:33:16
వరకు తదుపరి రేవతి
యోగం: శుక్ల 09:17:35 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కింస్తుఘ్న 09:35:57 వరకు
వర్జ్యం: 02:16:48 - 03:45:16
దుర్ముహూర్తం: 11:58:52 - 12:47:26
రాహు కాలం: 12:23:09 - 13:54:11
గుళిక కాలం: 10:52:07 - 12:23:09
యమ గండం: 07:50:03 - 09:21:05
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 11:07:36 - 12:36:04
సూర్యోదయం: 06:19:00
సూర్యాస్తమయం: 18:27:17
చంద్రోదయం: 06:44:01
చంద్రాస్తమయం: 19:11:21
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 15:33:16 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Comments