top of page
Writer's picturePrasad Bharadwaj

25 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 25, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹


శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday


🍀. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Varalakshmi Vrat to All. 🍀


మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ


🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరలక్ష్మీ వ్రతం, Varalakshmi Vrat 🌻



🍀. శ్రీ వరలక్ష్మీ స్తోత్రం 🍀

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : ఆకాంక్షకు సహచరులు - సాధనలో, పరమప్రాప్య మందు తీవ్ర ఆకాంక్ష వుండడం ఎంత అవసరమో. దానికి సహచరులుగా, ప్రశాంతి, వివేకం, నిస్సంగత్వం అనేవి ఉండడం కూడా అంతే అవసరం, ఏలనంటే, ఈ మూడింటికీ వ్యతిరేక లక్షణాలు నీలో వుంటే, అవి జరగవలసిన దివ్య పరివర్తనకు అవరోధాలు కల్పిస్తాయి. 🍀 🌷🌷🌷🌷🌷 🌸. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలకష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు. 🌷🌷🌷🌷🌷 విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, వర్ష ఋతువు, దక్షిణాయణం, శ్రావణ మాసం తిథి: శుక్ల-నవమి 26:03:16 వరకు తదుపరి శుక్ల-దశమి నక్షత్రం: అనూరాధ 09:15:23 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: వైధృతి 18:45:20 వరకు తదుపరి వషకుంభ కరణం: బాలవ 14:36:50 వరకు వర్జ్యం: 14:42:22 - 16:15:54 దుర్ముహూర్తం: 08:31:49 - 09:22:07 మరియు 12:43:18 - 13:33:36 రాహు కాలం: 10:43:51 - 12:18:09 గుళిక కాలం: 07:35:14 - 09:09:33 యమ గండం: 15:26:47 - 17:01:05 అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43 అమృత కాలం: 24:03:34 - 25:37:06 సూర్యోదయం: 06:00:55 సూర్యాస్తమయం: 18:35:23 చంద్రోదయం: 13:23:37 చంద్రాస్తమయం: 00:36:31 సూర్య సంచార రాశి: సింహం చంద్ర సంచార రాశి: వృశ్చికం యోగాలు: రాక్షస యోగం - మిత్ర కలహం 09:15:23 వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం దిశ శూల: పశ్చిమం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comentários


bottom of page