top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 168 / Agni Maha Purana - 168


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 168 / Agni Maha Purana - 168 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 51


🌻. సూర్యుడు మరియు ఇతర గ్రహా ప్రతిమా లక్షణములు - 3 🌻


అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, కులికుడు మొదలగు ప్రముఖ నాగ గణములన్నియు సూత్రమును ధరించును. వీరందరును పడగల ఆకారముల గల ముఖములతో, గొప్ప తేజఃపుంజముతో ప్రకాశించు చుందురు, ఇంద్రుడు వజ్రము ధరించి గజముపై ఎక్కియుండును. అగ్ని శక్తి హస్తుడై మేక మీద కూర్చుంéడును. యుముడు దండము ధరించి మహిషాధిరూఢుడై ఉండును. ఖడ్గధారియైన నిరృతికి వాహనము మనిషి. వరుణుడు పాశహస్తుడా మకరముపై ఉండును. వజ్రధారియైన వాయుదేవునకు లేడి వాహనము. కుబేరుడు గద ధరించి గొఱ్ఱపై ఉండును. జటధారియైన ఈశానునకు వాహనము వృషభము.


లోకపాలులందరును ద్విభుజులు. విశ్వకర్మ చేతిలో అక్షసూత్రముండును. హనుమంతుని హస్తమునందు వజ్రయుధముండును. రెండు పాదములతో ఒక ఆసురుని అణగ ద్రొక్కి నిలబడును. కింనరులు వీణాధారులు, విద్యా ధరులు మాలాదారులై ఆకాశమున విహరించు చుందురు. పిశాచముల శరీరములు అస్థిపంజరమాత్ర శేషములుగ నుండును. వేతాళముల ముఖములు భయంకరముగ నుండును. క్షేత్రపాలులు శూలములు ధరించు యుందురు. ప్రేతముల ఉదరములు పెద్దవిగ నుండును. శరీరములు కృశించి యుండును.


అగ్ని మహాపురాణమునందు సూర్యాది ప్రతిమాలక్షణమను ఏబది ఒకటవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 168 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 51


🌻Characteristics of the images of the Sun and other planets - 3 🌻


13. (The serpents) Ananta, Takṣaka, Karka, Padma, Mahābja and Śaṅkha are all (represented as) having hooded heads with great radiance.


14. (The image of) Indra is endowed with thunder-bolt and as seated on an elephant, (that of) Agni as riding a goat and holding a spear, (that of) Yama as on a buffalo and carrying a club and (that of) Nirṛti as holding a sword.


15. (The image of) Varuṇa (ocean god) is made as seated) on a crocodile and as holding a noose, (that of) Vāyu (wind god) (as riding) an antelope and holding a banner, (that of) Kubera (god of wealth) as seated on a sheep and bearing a mace, and (that of) Īśāna (as seated) on a bull and having a matted hair.


16. (The images) of the guardian deities of the quarters of the world are endowed with two arms. (The celestial architect) Viśvakarman (should be represented) as holding a rosary. (The figure of) Hanūmat (monkey, devoted to Rāma) may be holding the thunderbolt in his hand and pounding the earth with his feet.


17. (The semi-divine beings) Kinnaras may be (represented) as holding lutes in their arms and the Vidyādharas (semi-divine beings) as having garlands (and moving) in the sky. The goblins may be (represented) as having emaciated bodies and the vampires as deformed faces, the Guardians of the sites as having the tridents and the spirits of the dead people as lean and big-bellied.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Commentaires


bottom of page