🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 170 / Agni Maha Purana - 170 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 52
🌻. చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 2 🌻
తూర్పుదిక్కు నుండి అగ్నేయము వరకు, విలోమ క్రమమున, అన్ని దిక్కులందును భైరవుని స్థాపించి క్రమముగ పూజింపవలెను. బీజమంత్రమును ఎనిమిది దీర్ఘస్వరములలో ఒక్కొక్క దానిచేత విడగొట్టి, అనుస్వార యుక్తము చేసి, ఆయా దిక్కునందున్న భైరవునితో కలిపి అన్నింటికి చివర 'సమః' చేర్చవలెను.
ఉదా. ''ఓం హ్రాం భైరవాయనమః - ప్రాచ్యామ్, ఓం హ్రీం భైరవాయనమః- ఐశాన్యామ్; ఓం హ్రూం భైరవాయనమః- ఉదీచ్యామ్; ఓం హ్రేం భైరవాయ నమః - వాయవ్యే; ఓం హ్రైం భైరవాయ నమః-ప్రతిచ్యామ్ ఓం హ్రోం భైరవాయనమః -నైరృత్యామ్; ఓం హ్రౌం బైరవాయ నమః అవాచ్యామ్; ఓం హః అగ్నేయ్యామ్''
ఈ విధముగ మంత్రోచ్చారణ చేయుచు ఆయా దిక్కులలో భైరవ పూజ చేయవలెను. వీటిలో ఆరు బీజమంత్రములతో షడంగన్యాసము చేసి ఆ అంగముల పూజ చేయవలెను. ధ్యానము ఈ విధముగ చేయవలెను. ''భైరవుడు అగ్నేయ దళమునందు విరాజిల్లుచు, బంగారు నాలుకతోడను, నాద-బిందు, చంద్రులతోడను, మాతృకాధి పత్యంగము తోడను ప్రకాశించుచున్నాడు. (అట్టి బైరవునకు నమస్కారము). వీరభద్రుడు వృషభారూఢుడు. మాతృకామండల మధ్యమున నుండును. నాలుగు హస్తములు. గౌరికి రెండు హస్తములు మూడు నేత్రములు. ఒక హస్తము నందు శూలము, రెండవ దానిలో దర్పణము ఉండును. లలితా దేవి కమలముపై కూర్చుండను. నాలుగు భుజములలో త్రిశూలము, కమండలువు, కుండి, వరదాన ముద్ర ధరించి యుండును.
స్కందుని అనుసరించి యుండు మాతృకా గణము చేతులలో దర్పణము. శలాక ఉండును. చండికకు పది భుజములుండును. కుడి చేతులలో బాణ - ఖడ్గ - శూల - చక్ర, శక్తులను ధరించి యుండును. వానుహస్తములలో నాగపాశ - చర్మ - అంశుశ - కుఠార - ధనస్సులను ధరించును. సింహాధిరూఢయైన ఆ దేవి ఎదుట శూలముచే చంపబడిన మహిషాసురుని శవము పడి యుండును.
అగ్ని మహా పురాణమునందు చతుఃషష్టి యోగిన్యాది లక్షణమును ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 170 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 52
🌻Characteristics of images of different forms of goddesses - 2 🌻
12. One has to worship him being endowed with the letters of the alphabet upto the letter ‘ra’ and with (his mantra) having six constituents and the eight long vowel mantras.
13. (He is also to be contemplated upon) as established in the wicks of the flame in the house as endowed with golden ornaments and the nāda, bindu and indu[2] and making the body of the divine mother and the lord radiant.
14. Vīrabhadra (attendant of Śiva) (is represented) as having four faces, seated on a bull in front of the mother (goddesses). (Goddess) Gauri (consort of Śiva) (is represented) as having two arms and three eyes as endowed with a spear and mirror.
15. (Goddess) Lalitā (a form of Durgā) (should be represented) as having tour arms (holding) a spear, a small pitcher, (and another) pitcher (in the hands) and showing boonconferring hands. (She should) be seated on the lotus. (She should also) be endowed with a mirror, a small stick for applying collyrium and Skanda and Gaṇa (Gaṇeśa).
16. (Goddess) Caṇḍikā may (be represented) as having ten hands having a sword, spear, disc (and) dart in the right (hand) and the magical noose, shield, pike, axe, and bow in the left (hand). (She must) be riding a lion with the buffalo (demon) having been slain with (her) spear in front of her.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments