top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 171 / Agni Maha Purana - 171


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 171 / Agni Maha Purana - 171 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 53


🌻. లింగాది లక్షణములు - 1 🌻


హయాగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను లింగాదుల లక్షణము చెప్పెదను; వినుము. లింగము పొడవులో సగమును ఎనిమిది భాగములు చేసి. వాటిలో మూడు భాగములు విడచి, మిగిలిన ఐదు భాగములతో చతురస్రమైన విష్కంభము నిర్మింపవలెను. మరల పొడవును ఆరు భాగములు చేసి వాటిని ఒకటి, మూడు అను క్రమమున వేరుగా ఉంచవలెను. వీటిలో మొదటి భాగము బ్రహ్మదేవునిది; రెండవది విష్ణువునకు సంబంధించినది. మూడవది శివునిది. దీనికి ''వర్ధమాన భాగము'' అని పేరు. చతురస్ర మండపమున కోణ సూత్రార్థ ప్రమాణము గ్రహించి, దానిలో అన్ని కోణముల మీదను గుర్తులుంచవలెను. ఇట్లు చేయగా ఎనిమిది కోణముల వైష్ణవ భాగము సిద్ధించును. సందేహము లేదు. పిమ్మట పదునారు కోణముల తోడను, ముప్పదియారు కోణములతోడను కూడిన దానిగా చేయవలెను.


పిమ్మట అరువది నాలుగు కోణములుండునట్లు చేసి అచట ఒక గోళాకార రేఖ గీయవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు లింగము శిరోభాగమును ఖండించవలెను. పిమ్మట లింగ విస్తారమును ఎనిమిది భాగములుగ విభజింపవలెను. పిమ్మట వాటిలో ఒక భాగము యొక్క నాల్గవ భాగమును విడువగా ఛత్రాకారమగు శిరస్సు ఏర్పుడును. మూడు భాగములందును పొడవు వెడల్పులు సమానముగా నుండు లింగ సకల మనోభిష్టములను ఇచ్చును. దేవపూజిత లింగము నందు పొడవులోని నాలుగవ భాగముచే నిష్కంభము ఏర్పడును. ఇపుడు అన్ని లింగముల లక్షణములను వినుము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 171 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 53


🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 1 🌻


The Lord said:


1-2. O Lotus-born (Brahman) I shall describe to you the characteristics of the liṅga and other things. Listen. Having-marked a rectangular (block of stone) as divided into two parts lengthwise, the lower part again being divided into eight parts and three parts of these divisions being left out, the remaining (block) formed by five parts should be divided breadthwise into three parts and the three (gods) should be assigned therein.


3. This is spoken as representing the forms of Brahman, Viṣṇu and Śiva (among) which (the last one) is larger (than the other two parts). Half of the figure is marked at the angular points in the square.


4. An octagonal (block) known as the part of Viṣṇu is -certainly obtained (thus). Then a polygon of sixteen sides is made and then a polygon of thirty-two sides.


5. Having made a polygon of sixty-four sides, the circular shape is accomplished. Then the excellent spiritual teacher should chisel the head portion of the emblem.


6. The breadth of the liṅga may be divided into eight parts. An umbrella-shaped top portion (of the liṅga) is got by discarding half of this length.


7. A liṅga which has a breadth equal to three-fourth of its length bestows all the desired benefits.


8. The pillar (part of the emblem) should be a quarter of the length (of the emblem) in the case of those worshipped by the celestials. Listen now (the narration) of the characteristics of all liṅgas.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

コメント


bottom of page