top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 172 / Agni Maha Purana - 172


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 172 / Agni Maha Purana - 172 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 53


🌻. లింగాది లక్షణములు - 2 🌻


పండితుడు పదునారు అంగుళముల లింగమునకు మధ్య బ్రహ్మరుద్ర భాగములకు సమీపమున నున్న సూత్రము తీసికొని దానిని ఆరు భాగములుగ విభజింపవలెను. వైయమన సూత్రముల సాహాయ్యముతో నిశ్చయింపబడిన ఈ పరిమాణమునకు 'అంతరము' అని పేరు. అన్నింటి కంటె ఉత్తరము నందున్న లింగమును ఎనిమిది యవల పెద్దదిగా ఉండునట్లు చేయవలెను. మిగిలిన లింగములను ఒక్కొక్క యవ తగ్గునట్లు చేయవలెను.


పైన చెప్పిన లింగము క్రింది ప్రదేశమును మూడు భాగములుగా విభజించి పై భాగము నొకదానిని విడచి వేయవలెను. మిగిలిన రెండు భాగములను ఎనిమిది భాగములుగ విభజించి పై మూడు భాగములను విడచి వేయవలెను. ఐదవ భాగముపై భాగము నుండి తిరుగుచున్న ఒక దీర్ఘరేఖ గీయవలెను. ఒక భాగమును విడచి, మధ్యయందు ఆ రెండు రేఖలను కలపవలెను. ఇది లింగముల సాధారణ లక్షణము. ఇపుడు పిండిక యొక్క సర్వసాధారణ లక్షణమును చెప్పెదను; వినుము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 172 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 53


🌻Characteristics of the Liṅga (parabolic representation of Śiva) - 2 🌻


9. The wiseman should divide the liṅga measuring 16 aṅgulas into 6 parts through the central line upto the Brahman and Rudra parts.


10. The spaces in between two such lines of division should measure eight yavas each in the first two cases, each latter measuring a yava less than the preceding one.


11. Having divided the lower part into three parts, one part should be left out. Having divided the (remaining) two parts into eight parts, the three upper ones (of these divisions) should be left aside.


12. Those (three sections) above the five divisions should be rotated and the markings lengthened. Having left out one part their union should be brought about.


13. These are the general characteristics of the liṅga described by me. I shall (now) describe the most general (characteristics) of the pedestals.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page