🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 174 / Agni Maha Purana - 174 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 54
🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు నేను ఇతర లింగాదులను గూర్చి చెప్పెదను; వినుము లవణముతోను, ఘృతముతోను చేసిన శివలింగము బుద్ధిని వృద్ధి పొందించును. వస్త్రమయ లింగము ఐశ్వర్యదాయకము. అది తాత్కాలిక లింగము. మృత్తికతో నిర్మించిన లింగము పక్వము, అపక్వము అని రెండు విధములు. అపక్వము కంటె పక్వము శ్రేష్ఠము. దాని కంటె కఱ్ఱతో చేసిన లింగము అధిక పుణ్యదాయకము, పవిత్రము. దాని కంటె శిలా లింగము శ్రేష్ఠము. దాని కంటె ముత్యముల శివ లింగము. దాని కంటె సువర్ణ లింగము ఉత్తమములు వెండి, రాగి, ఇత్తడి, రత్నములు, పాదరసము వీటితో నిర్మించిన శివలింగము భోగమోక్షప్రదము, శ్రేష్ఠము, రసలింగమును రత్నములలోగాని, సువర్ణాది లోహములలో గాని బంధించి స్థాపించవలెను. సిద్ధాదులచే స్థాపింపబడిన స్వయం భూలింగాదులకు కొలతలు మొదలగునవి చేయుట యుక్తముకాదు.
బాణ లింగమున విషయమున కూడ (నర్మదోద్భవమునకు) ప్రమాణాదిచింత ఉండ కూడదు. అట్టి లింగములకై ఇచ్ఛానుసారముగా పీఠప్రాసాదాది నిర్మాణము చేయవచ్చును. సూర్యమండలస్థ శివలింగమును అద్దములో ప్రతిబింబింపజేసి పూజించవలెను. లింగముపై శివార్చన పరిపూర్ణము, సకలకామ ప్రదము, శివలింగము ఎత్తు హస్తము కంటె ఎక్కువ ఉండవలెను. కాష్ఠమయ శివలింగము కూడ అంతయే ఉండవలెను. చల శివలింగ స్వరూపమును అంగుళమానానుసారమును, స్థిర లింగ స్వరూపమును ద్వార- గర్భ-హస్తమానముల అనుసారము నిర్ణయింపవలెను. గృహములో పూజింపబడు చల లింగము ప్రమాణము ఒక అంగుళము మొదలు పదునైదు అంగుళముల వరకును ఉండవచ్చును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 174 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 54
🌻The dimensions of different varieties of the Liṅga - 1 🌻
The Lord said:
1. I shall describe the measurement of the liṅga in a different way. Listen. I shall (now) speak about the liṅgas made of salt, (and) ghee (which when worshipped) increases (one’s) intellect.
2. A liṅga made of cloth (is worshipped) for the sake of wealth. It is known as temporal. The one made of earth is either burnt or half burnt of which the former is better.
3. Then, one made of wood is meritorious. One made of stone is more meritorious than that made of wood. (The liṅga) made of pearl is more meritorious than that of stone. Then (relatively merit-worthy) are the liṅgas made of iron, and gold.
4. The liṅgas made of silver, copper and brass yield enjoyment and release from bondage. The liṅgas made of red lead and mercury are excellent and confer enjoyment and release from bondage.
5. The installation of a liṅga on the earth made of mercury and iron etc or studded with gems increases one’s glory and grants success as desired.
6. If desired one can build temples and bases to these (emblems) on the left side. One may worship the image of the sun cast on the mirror.
7. Hara should be worshipped everywhere. The worship gets completed only (by the worship) of the liṅga. A liṅga made of stone or wood should be of a cubit length.
8. The movable liṅga should be of the size of a finger and encircled by the adytum. The liṅga worshipped in the house should be of the size of one to fifteen fingers.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments