🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 175 / Agni Maha Purana - 175 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 54
🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 2 🌻
ద్వారమానమును బట్టి లింగము మూడు విధములగును. వీటిలో ఒక్కొక్క దానికి గర్భమానమును బట్టి, తొమ్మిదేసి భేదములగును. హస్తమానముచే తొమ్మిది భేదములగును. వీటిని దేవాలయములో పూజింపవలెను. ఈ విధముగ అన్నింటిని కలపగా ముప్పదియారు లింగములు. ఇది లింగముల జ్యేష్ఠమానము. మధ్యమమాన-కనిష్ఠ మానముల ఛేత కూడ ముప్పదియారు-ముప్పదియారు శివలింగము లగును. ఈ విధముగ అన్ని లింగములను కలుపగానూట ఎనిమిదిలింగము లగును. ఒకటి మొదలు ఐదు అంగులముల వరకు కనిష్ఠము (చిన్నది) ఆరునుండి పది అంగుళములవరకు చల లింగము మధ్యమము. పదకొండు నుండి పదునైదు అంగుళముల వరకు చల శివలింగము జ్యేష్ఠము. చాలమూల్యముగల రత్నములతో నిర్మించిన లింగము ఆరు అంగుళములు, సాధారణ రత్న నిర్మితము తొమ్మిది అంగుళములు, సువర్ణ నిర్మితము పండ్రెండు అంగుళములు ఇతర పదార్థ నిర్మితము పదునైదు అంగుళములు ఉండవలెను.
లింగ శిలను పదునారు భాగములు చేసిపై నాలుగు భాగములలో ప్రక్కనున్న రెండు భాగములను తీసివేయవలెను. మరల ముప్పది రెండు భాగములు చేసి దాని రెండు కోణములందును ఉండు పదునారు భాగములు తీసివేయవలెను. మరల దానిలో నాలుగు భాగములు కలుపగా కంఠము ఏర్పడును. అనగా ఇరువది భాగములు కంఠముగా ఏర్పుడను. రెండు ప్రక్కలను పడ్రెండు భాగములను తీసివేయుటచే జ్యేష్ఠ చల లింగము ఏర్పడును. ప్రాసాద (దేవాలయ)ము ఎత్తును పదునారు భాగములుగా విభజింపగా, నాలుగు, ఆరు, ఎనిమిది భాగముల ఎత్తుచే వరుసగా కనిష్ఠ-మధ్య-జ్యేష్ఠద్వారము లేర్పుడును. ద్వారము ఎత్తులో నాల్గవ వంతు తగ్గించగా అది లింగము ఎత్తు అగును. లింగ శిలాగర్భము ఎత్తులో సగము ఎత్తుగల శివలింగము కనిష్ఠము. పదునైదు భాగముల ఎత్తు గలది జ్యేష్ఠము. ఈ రెండింటి మధ్య ఏడు చోట్ల సూత్రపాతము చేయవలెను. ఈ విధముగ తొమ్మిది సూత్రము లగును ఈ తొమ్మిది సూత్రములలో ఐదు సూత్రముల ప్రమాణము గల లింగము మధ్యమము, లింగముల ఎత్తు రెండేసి భాగముల తేడాతో ఉండును. .
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 175 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 54
🌻The dimensions of different varieties of the Liṅga - 2 🌻
9. The liṅgas are classified into three groups according to the measure of the doorway or into nine groups according to the measure of the adytum. These liṅgas should be worshipped in one’s residence.
10. Thus there are thirty-six liṅgas in the first class, thirty-six in the second class and thirty-six in the third class.
11. Thus totally there would be one hundred and eight liṅgas. The liṅgas (measuring) one to five fingers (known as) the short are said to be movable.
12. The movable liṅgas measuring six to ten fingers are known as middle. Those measuring eleven to fifteen fingers are known as the best.
13. (Those made) of excellent gems (should measure) six fingers. (Those made) of other gems (should measure) nine fingers. The golden ones (should be) twelve (fingers). The rest of the liṅgas (should be) fifteen (fingers).
14. The four sets of corners from the top should be successively cut into four or sixteen equal sides, and those again into thirty-two and sixty-four (in turn so as to make it a polygon of sixty-four equal sides).
15. The two sides being thus lopped off, the neck of a solid liṅga should be twenty-six parts from the rectangular space at its foot.
16. (The face of the liṅga) should gradually be decreasing by four, six and eight parts from its base (and similarly) the middle part of the liṅga should be gradually less than the height at its beginning by a foot.
17. That which is equal to half (the size of) the adytum is (said to be) the lowest (variety of) liṅga. That which is fifteen (fingers in length) is the excellent. Seven equal lines should be drawn in the central portion of these liṅgas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments