top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 176 / Agni Maha Purana - 176


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 176 / Agni Maha Purana - 176 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 54


🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 3 🌻


ఈ విధముగ లింగముల పొడవు పెరగగా తొమ్మిది లింగములు నిర్మాణమగును. హస్తప్రమాణముచే లింగమును నిర్మించినచో, మొదటి లింగము ప్రమాణము ఒక హస్తము రెండవ దాని ప్రమాణము మొదటి దాని కంటె ఒక హస్తము ఎక్కువ. ఈ విధముగ తొమ్మిది హస్తములు కొలత పూర్తిఅగు వరకు ఒక్కొక్క హస్తము పెంచుతు పోవలెను. పైన చెప్పిన హీన-మధ్యమ-జ్యేష్ఠ లింగములో ఒక్కొక్క దానికి మూడేసి భేదములుండను.


బుద్ధిమంతుడు ఒక్కొక్క లింగమునందు విభాగ పూర్వకముగ. మూడేసి లింగములు నిర్మింప చెయవలెను. ద్వారమానము, గర్భమానము, హస్తమానము అను ఈ మూడు దీర్ఘమానానుసారము స్థిర లింగమును నిర్మింపవలెను. పై మూడు ప్రమాణముల ననుసరించి భగేశుడు, జవేశుడు, దేవేశుడు అని మూడు పేర్లు ఏర్పడును. విష్కంభ (విస్తార) మును బట్టి లింగమునకు నాలుగు రూపములు గుర్తింపవలెను. దైర్ఘ్య ప్రమాణానుసారము ఏర్పడు, మూడు రూపములలో కావలసిన లింగమునకు శుభమగు ఆయాదికముండు నట్లు చూచు కొనవలెను. ఈ మూడు విధముల లింగముల పొడవు నాలుగు లేదా ఎనిమిది హస్తములుండుట మంచిది. ఇవి వరుసగ త్రిగుణ స్వరూపములు. లింగము పొడవు ఎన్ని హస్తములున్నదో ఆ హస్తములను అంగుళములలోనికి మార్చి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు సంఖ్యలచే విభజింపవలెను. మిగిలిన దానిని పట్టి శుభాశుభ నిర్ణయము చేయవలెను.


ధ్వజాద్యాయములలో ధ్వజ - సిహ - గజ - వృషభాయములు మంచివి. మిగిలిన నాల్గును చెడ్డవి. స్వర సంఖ్యచే - అనగా ఏడుచేత భాగించినపుడు షడ్జ-గాంధార-పంచమములు (శేషము) సుభదాయకములు.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 176 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 54


🌻The dimensions of different varieties of the Liṅga - 3 🌻


18. In this way there would be nine lines. The middle (variety of liṅga) would have five lines. The length of the liṅgas should be nine fingers. The opposite side (should be) separated by two intermediate links.


19. The liṅga is measured out cubit by cubit till it would be nine hands (length). The liṅga is of three kinds—inferior, mediocre and superior.


20-22. A wiseman should mark three liṅgas at the centre of every liṅga foot by foot at fourteen (places) by a fixed measure of length of the door or the adytum. Four liṅgas representing Śiva, Viṣṇu, Bṛhaspati proportionately should be marked by the breadth. The liṅga should be (shaped) long to represent the three forms.


23. The liṅga should have a circumference of four, eight, eight (inches) representing the three qualities. One should make the liṅgas of such lengths as one desires.


24. One should divide the figure (marked) by the banners, celestial gods, elements or cocks. One should know the good or bad from the inches left over.


25. The banners etc., the crows, lions, elephants and goats are excellent. The others are auspicious. Among the primary notes of Indian gamut, the first one, second one and the fifth one confer good.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page