top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 178 / Agni Maha Purana - 178


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 178 / Agni Maha Purana - 178 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 54


🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 5 🌻


మూర్ధాన్తభాగము భూతభాగేశ్వరునిది. వ్యక్త-అవ్యక్తలింగములన్నింటికిని ఇదే పద్ధతి. ఐదులింగముల ఏర్పాటున్న శివలింగమునకు గుండ్రముగ చేయవలెను. ఈ గోలాకారము ఛత్రమువలె నుండవచ్చును, కోడిగుడ్డువలె నుండవచ్చును, లేదా నవోదితచంద్రువలె ఉండవచ్చును. కామ్యభేదమును పట్టి నాలుగువిధములగు ఫలభేదములను చెప్పుచున్నాను. లింగము శిరోవిస్తారము ఎన్ని అంగుళములుండునో ఆ సంఖ్యను ఎనిమిదిచే భాగించవలెను. ఈ విధముగ శిరస్సును ఎనిమిదిభాగములుగ విభజించి మొదటి నాలుగుభాగములును విస్తార-ఔన్నత్యముల ననుసరించి గ్రహింపవలెను. ఒక భాగమును తీసివేయగా ''పుండరీకము'' అను లింగము, రెండుభాగములను తీసివేయగా, 'విశాలము' అనులింగము, మూడు భాగమునులను తీసివేయగా ''శ్రీవత్సము'' అనులింగము, నాలుగుభాగములను తీసివేయగా ''శత్రుకారలింగము'' ఏర్పడును. అన్ని ప్రక్కలనుండియు శిరోభాగము సమముగనున్నది శ్రేష్ఠము. దేవపూజ్య లింగము నందు లింగశిరోభాగము కుక్కుటాండమువలె గోలాకారమున నుండవలెను.


చతుర్భాగాత్మక లింగమునందు పై రెండు భాగములను తొలగించగా ''త్రపుష'' మను లింగ మేర్పడును. ఇది అనాఢ్యమను శివలింగముయొక్క శిరస్సుగా చెప్పబడుచున్నది. ఇపుడు అర్ధచంద్రాకార శిరస్సు గూర్చి వినుము. శివలింగ ప్రాంతభాగమునందు ఒక అంశమును నాలుగు అంశములచేసి ఒక అంశమును విడిచినచో దానికి ''అమృతాక్షరము'' అని పేరు. రెండవ- మూడవ- నాల్గవ అంశములను తొలగింపగా క్రమముగ వాటికి ''పూర్ణేందు'' ''బాలేన్దు'' ''కుముద''ము లని పేర్లు. ఇవి క్రమముగ చతుర్ముఖ- త్రిముఖ-ఏకముఖములు. ఈ మూడింటికి "ముఖలింగము" లని కూడ పేర్లు.


సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 178 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 54


🌻The dimensions of different varieties of the Liṅga - 5 🌻


34. (From the navel) upto the head is the part of Śiva. Similarly, it is in the case of distinct and indistinct forms. In the liṅga of five parts, the head part is said to be circular.


35. The images (may be) of the shape of an umbrella, cock or crescent moon. I shall describe the merits of the four varieties. in each (class) differing on account of one’s option.


36. The head portion (of the liṅga) should be divided into eight parts. The first part of the longitudinal portion should be divided into four parts.


37- 39. There (should be) four lines successively drawn in order to divide into parts. We have by one part the lotus, the one called viśāla by cutting off, the śrīvatsa by thinning out and the śatrukṛt by elision of the fourth part. In the sarvasama class the top portion is the excellent and the cock-shaped in the sura class among the liṅga of four parts. The top portion of the anādi has been described. You lisṭen to (the characteristics of) the crescent of the top.


40. At a corner of a part (there should be) the charming axis (represented) by four parts deficient by one part. By the elision of two, three and four parts in order, (one gets) the full, crescent moon and lotus shape.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page