🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 179 / Agni Maha Purana - 179 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 54
🌻. లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణములు - 6 🌻
ఇపుడు ముఖలింగమును గూర్చి వినుము. పూజాభాగమును. మూర్తిపూజ, అగ్నిపూజ, పదపూజ అని మూడు విధములుగ కల్పించుకొనవలెను. వెనుకటివలె ద్వాదశాంశమును విడచి, ఆరుభాగముల ద్వారా ఆరు స్థానములను అభివ్యక్తము చేయవలెను. శిరస్సు ఎత్తుగానుండనట్లు, లలాట-నాసికా-మఖ-చిబుక-కంఠములు స్పష్టముగ కనబడునట్లు చేయవలెను. నాలుగు అంళములచే రెండుభుజములను, నేత్రములను ఏర్పరుపవలెను. ప్రతిమాప్రమాణానుసారము హస్తము ముకులాకారముగా ఏర్పరచి, విస్తారములోని ఎనిమిదవ అంశముచే నాలుగుముఖములను ఏర్పరుపవలెను. అన్ని ప్రక్కలనుండియు సమముగ ఉండవలెను. ఇంతవరకు చతుర్ముఖ లింగమును గూర్చి చెప్పితిని; ఇపుడు త్రిముఖలింగమును గూర్చి చెప్పదను: వినుము.
చతుర్ముఖలింగముకంటె త్రిముఖలింగమునకు చెవులు, పాదములు అధికము. లలాటాదులను వెనుకటివలెనే ఏర్పరుపవలెను. నాలుగు అంశలతో రెండు భుజములను నిర్మింపవలెను. వాటి వెనుక భాగము దృఢముగా నుండవలెను. విస్తారముయొక్క ఎనిమిదవ అంశమునందు మూడు ముఖములును స్పష్టముగ కనబడవలెను. (ఏక ముఖ లింగము):- ఏకముఖమును తూర్పువైపున నిర్మింపవలెను. దాని నేత్రములు సౌమ్యముగా నుండవలెను. దాని లలాట-నాసికా-ముఖ-కంఠములు పైకి ఉబికి యుండవలెను. బాహువిస్తారములో ఐదవ అంశముచే పైన చెప్పిన అవయముల నిర్మాణము జరుగవలెను. దానిని బాహురహితముగ నిర్మింపవలెను. ఈ ఏకముఖలింగమునందు విస్తారములో ఆరవ అంశమునందు. ముఖ నిర్మాణము హితకరమని చెప్పబడినది. ముఖయుక్తములగు అన్ని లింగము శిరోభాగములును త్రపుషాకారములో గాని, కుక్కుటాండాకారముగాని ఉండవలెను.
అగ్నిమహాపురాణమునందు లింగమానాదివ్యక్తావ్యక్త లక్షణమును ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 179 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 54
🌻The dimensions of different varieties of the Liṅga - 6 🌻
41. Listen then to (the description of forms having) four or three faces or one face and mukhaliṅga. The part to be worshipped is to be made set with nine parts.
42-43. Having left out twelve parts for the arms and eyes, as before, the head, forehead, nose, face, chin, neck are then to be made. Having covered by the hands, the arms and eyes (are made) with four parts proportionate to the measurement of image.
44. The face should be made equal to one-eighth part of the breadth. I have described the four-faced form. Listen! The three-faced form is described now.
45. The ear and feet are made. One has to mark the forehead etc. for that. Then the arms should be made with four parts quite strong.
46. The projection of the frontispiece (should be) one-eighth of the breadth. One face has to be made such as to have beautiful eye on the eastern side.
47. It should be made round at the forehead, nose, face and neck. By one-fifth from the arm one should make it round. less by one’s arm length.
48. It is good to have the projections in the frontispiece as one-sixth of the breadth for all the mukhaliṅgas whether it is trapuṣa or kukkuṭa (?)
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments