top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 184 / Agni Maha Purana - 184


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 184 / Agni Maha Purana - 184 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 56


🌻. దశదిక్పతియాగ ము - 4 🌻


"మేషమునెక్కి, శక్తని ధరించియున్న బలిశాలివైన ఓ అగ్నిదేవా! దేవతలతో కూడవచ్చి, ఈ అగ్నేయదిక్కును రక్షింపుము. నా పూజ గ్రహింపుము; నీకు నమస్కారము; అని ప్రార్థించుచు అగ్నిని ఆవాహనముచేసి "అగ్నిర్మూర్ధా" లేదా అ"గ్నియే నమః" అను మంత్రముచే పూజింపవలెను. "మహిషారూఢుడవై దండము ధరించియున్న, మహాబలిశాలియైన సూర్యపుత్రా! యమదేవా! నీవు వచ్చి దక్షిణద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించి యముని ఆవాహనముచేసి, "వైవస్వతం సంగమనమ్‌ " ఇత్యాది మంత్రముచే పూజింపవలెను. "బలవాహన సంపన్నుడవైన, ఖడ్గధారియైన ఓ నిరృతీ! రమ్ము. ఈ అర్ఘ్యపాద్యములను గ్రహింపుము; నైరృతిదిక్కును రక్షించుము" అని ప్రార్థించుచనిరృతిని అవాహనముచేసి "ఏషతే నిరృతే" ఇత్యాది మంత్రముచే అర్ఘ్యాద్యుపచారములనిచ్చి పూజింపవలెను. "మకరమును ఎక్కినవాకడా! పాశధారీ! మహాబలశాలియైన ఓ వరుణదేవా! రమ్ము! పశ్చిమద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించుచు వరుణుని అవాహనముచేసి "ఉరుంహి రాజావరుణః" ఇత్యాది మంత్రములతో ఆచార్యుడు వరుణదేవతకు అర్ఘ్యము సమర్పించి పూజింపవలెను.


ధ్వజము ధరించిన, మహాబలశాలివైన వాయుదేవా, నీ వాహనమునెక్కి, దేవతలతోను మరుత్తులతోడనువచ్చి వాయువ్యదిక్కును రక్షించుము; నీకు నమస్కారము" అ%ి ప్రార్థించుచు వాయువును ఆవాహనచేసి "వాత ఆవాతు" ఇత్యాది మంత్రముచేతగాని, "ఓం నమో వాయవే" అను మంత్రముచేతగాని వాయుదేవుని పూజింపవలెను.


"బలవాహనంపన్నుడవు గదాధారివి అగు సోమా! నీవు వచ్చి ఉత్తరద్వారమును రక్షింపును. కుబేరసహితుడవగు నీకు నమస్కారము" అని ప్రార్థించుచు సోముని అవాహనముచేసి, "సోమం రాజానమ్‌" ఇత్యాది మంత్రము చేతగాని, "సోమాయనమః" ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 184 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 56


🌻Five divisions of installation - 4 🌻


19. O Agni! endowed with a trident, seated on a goat and possessing strength (you) come and accept my worship. You protect the south-east in the company of celestials. Salutations to you.


20-21. One should worship Agni with the sacred syllable agnir mūrddhā[2]. Salutations to Agni. O Yama! seated on the buffalo, wielding the mace, and possessing great strength. (you) come. You protect the southern gate. O Yama! salutations to you. Yama should be propitiated with the sacred syllable vaivasvataṃ saṅgamanam.[3]

22-24. O Nairṛta! carrying a sword accompanied by an army and riding an animal, (you) come. Here is the offering and water for washing the feet. You guard the south-western direction. Men should worship with the sacred syllable eṣa te nirṛte[4] and with offerings. O Varuṇa! riding the crocodile, holding the noose and possessing great strength (you) come and protect the western doorway. Salutations to you. The preceptor should worship with (the sacred syllable) uruṃ hi rājā varuṇam and offerings. 25-27. O Vāyu! endowed with strength, holding the banner, together with a vehicle you come. You guard the north-western direction in the company of celestials and Maruts (groups of celestial gods). Salutations to you. He should be worshipped with (the sacred syllables) vāta[5] etc. or with ‘Oṃ! Salutations to Vāyu’. O Soma! you come with strength, wielding the mace and riding the vehicle. You protect the northern gate along with Kubera. Salutations to you. One should worship with (the sacred syllable) somaṃ rājānam or Salutations to Soma’. Continues.... 🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page