🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 185 / Agni Maha Purana - 185 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 56
🌻. దశదిక్పతియాగ ము - 5 🌻
"వృషభారూఢుడవును, మహాబలశాలివి, శూలధారివి అగు ఈశానా! నీవు వచ్చి యజ్ఞమండపముయొక్క ఈశాన్యదిక్కును రక్షింపుము; నీకు నమస్కారము" అని ప్రార్థించి ఈశానుని ఆవాహనముచేసి "ఈశానమస్య" ఇత్యాది మంత్రము చేతగాని, "ఈశానాయ నమః" అను మంత్రముచేతగాని, పూజింపవలెను. "హస్తాగ్రములందు స్రుక్‌స్రువములను ధరించినవాడువును, హంసారూపుఢుడవును, జన్మరహితుడవును అగు ఓ బ్రహ్మదేవా! ఊర్ధ్వదిక్కను రక్షించుము: నీకు నమస్కారము" అని ప్రార్థించి, బ్రహ్మదేవుని ఆవాహనముచేసి,
"హిరణ్యగర్భః" ఇత్యాది మంత్రము చేతగాని "నమస్తే బ్రహ్మణ" ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను." "తాబేలు వీపుపై కూర్చున్నవాడా! నాగ గణముల అధిపతీ! చక్రధారీ! అనంతా! రమ్ము; అధర దిశను రక్షింపుము; అనంతేశ్వరా! నీకు నమస్కారము" అని ప్రార్థించుచు అనంతుని ఆవాహనముచేసి "నమో7స్తు సర్పేభ్యః" అను మంత్రముచేగాని, "అనన్తాయనమః" అను మంత్రముచేతగాని పూజింపవలెను.
అగ్నిమాహాపురాణమునందు దశదిక్పతియాగ మను ఏబదియారవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 185 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 56
🌻Five divisions of installation - 5 🌻
28-30. O Īsāna! (you) come along! possesser of strength, riding the bull. You guard the north-eastern direction of the ritual pavilion. Salutations to you. He should be worshipped with (the sacred syllable). īśānamasya[6] or ‘Salutations to Īsāna’. O Brahman! (you) come. Seated on a swan! Carrying the sacrificial vessel and ladle! You defend the direction above the sacrificial place, O unborn! Salutations to you. (One) should worship with (the sacred syllable) hiraṇyagarbha or ‘salutations to Brahman’.
31. O Ananta! you come. Endowed with the disc! Seated on the tortoise! Lord of the gaṇas. You protect the bottom (of the sacrificial place). O Lord Ananta! Salutations to you. One should worship with (the sacred syllable) ‘Salutations to serpent’ or ‘Salutations to Ananta’.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments