🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 186 / Agni Maha Purana - 186 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 57
🌻. కుంభాధివాసము - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: దేవతాప్రతిష్ఠా పూజల కొరకై గ్రహంచిన భూమిపై నారసింహా మంత్రము చదువుచు రాక్షసులను తొలిగించు అక్షతలు, ఆవాలు, పంచగవ్యములు చెల్లవెలను. రత్నయుక్తమగు కలశ##పై అంగదేవతా సమేతుడగు శ్రీహరిని పూజింపవలెను. అస్త్ర మంత్రముతో నూట ఎనిమిది పాత్రలను పూజింపవలెను. అవిచ్ఛిన్న ధారతో వేదిని తడిపి, ధాన్యము చల్లవలెను. కలశను ప్రదక్షిణాక్రమమున త్రిప్పి చిమ్మిన అన్నముపై ఉంచవలెను. కలశకు వస్త్రము చుట్టి దానిపై లక్ష్మీ నారాయణులను పూజింపవలెను. "యోగే యోగే" ఇత్యాది మంత్రము పఠించుచు మండలమున శయ్యను స్ధాపింపవలెను.
(స్నాన మండపమున కుశలపపై శయ్యదానిపై పరువు పరిచి దిక్కుల యందును. విదిక్కుల యందును విద్యాధిపతులను) (విష్ణువు యొక్క విభిన్న విగ్రహములను) పూజింపవలెను. పూర్వాది దిక్కులందు క్రమముగ విష్ణు-మధు సూదన-త్రివిక్రమ-వామనులను, ఆగ్నేయాది విదిక్కులందు క్రమముగ శ్రీధర-హృషీకేశ-పద్మనాభ-దామోదరులను పూజింపవలెను. దామోదరుని ఈశాన్యమున పూజింపవలెను. పిమ్మట స్నాన మండపమున, ఈశాన్యమునందున్న వేదిపై ఉన్న నాలుగు కలశలలో స్నానమునకు ఉపయోగించు అన్ని ద్రవ్యములను ఉంచవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 186 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 57
🌻Consecration of pitchers - 1 🌻
The Lord said:
1. One should do (the ceremony) of taking possession of the ground. One should scatter grains and mustard seeds uttering (the sacred syllable) ‘Nārasiṃha’ which destroys demons. One should sprinkle pañcagavya (the five things got from a cow).
2. Having worshipped the earth in the pitcher containing gems as well as Hari and his retinue, worship the eighteen pitchers therein with the sacred syllable of weapons.
3. The rice grains should be purified by an incessant shower (of water) and scattered around. The pitcher should be placed in their midst.
4-5. Lord Acyuta and (his consort) Śrī should again be worshipped in the pitcher (provided with) a cloth. The bed as well as the mattress should be spread on the kuśa grass on a drawn circle with (the recitation of) the sacred syllable yoge yoge.[1] Lord Viṣṇu, the slayer of (the demon) Madhu and the lord of the three (divisions of the universe) and also the different lords of learning are worshipped on the bed.
6-7. Having worshipped Vāmana, Śrīdhara, Hṛṣīkeśa, Padmanābha (different forms of Viṣṇu) in the north-west and other (corners) of the bathing place and the Dāmodara (form of Viṣṇu) in the north-east and having brought all the materials to the bathing pavilion they should be deposited in the four pitchers and the altar in the north-east.
8. These pitchers should be consecrated in the four quarters with the pitchers containing water for the consecration. The pitchers should be placed with due regard for the purpose of consecration.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments