🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 188 / Agni Maha Purana - 188 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 57
🌻. కుంభాధివాసము - 3 🌻
వీటనన్నింటిని ఒక కలశలో నుంచి, దానిపై ఇష్టదేవతను స్థాపింపవలెను. ఇతర కలశయందు, నదులు కొండ కాలువలు, చెరువులు-వీటి నీటితో కూడిన జలము నుంచవలెన. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపము నందు ఇతర కలశలను స్థాపింపవలెను. ఈ కలశలను గందోదకాదులతో నింపవలెను. వాటినన్నిటివి శ్రీ సూక్తముతో అభిమంత్రించవలెను. ఒక పాత్రలో, అర్ఘ్యము కొరకై, ఆవాలు, గంధము, కుశాగ్రములు, అక్షతములు, ఫలములు పుష్పములు ఉంచి తూర్పున ఉంచవలెను. కమలములను, శ్యామాలతను, దూర్వాదలములను, విష్ణుక్రాంతము, కుశములను పాద్యముకొరకై దక్షిణమునుంచవలెను. మధుపర్కము పశ్చిమము నందుంచవలెను. కక్కోల-లవంగ-జాతీఫలములను అచమనీయర్థమై ఉత్తరము నందుంచవలెను.
దూర్వాక్షతలతో కూడిన ఒక పాత్రను నీరాజనమునకై అగ్నేయము నందుంచవలెను. ఉద్వర్తనపాత్రను వాయవ్యమునందును, ఈశాన్యమున గంధపిష్టపాత్రను ఉంచవలెను. కలశలో సురామాంసి. ఉసిరికాయ, సహదేవి, పసుపు మొదలైనవి వేయవలెను. నీరాజనము కొరకై ఆరువది ఎనిమిది దీపములుంచవలెను. శంఖము, చక్రము శ్రీవత్సము, వజ్రము, కమలములు మొదలైన వివిధ వర్ణముల గల పుష్పము సువార్ణాది పాత్రలలో సమకూర్చుకొనవలెను.
అగ్ని మహాపురాణము నందు కుంభాధివాసమున ఎనుబది ఏడవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 188 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 57
🌻Consecration of pitchers - 3 🌻
20. Another (set of) pitchers filled with perfumes etc. should be placed at eighty-one places and consecrated with the śrīsūkta[2].
21. Barley grains, white mustard, perfumes, tips of kuśa grass, unbroken rice, sesamum, fruits and flowers should be first placed for the sake of worship.
22. The lotus, (the creeper called) śyāmalatā, dūrvā grass, leaf of holy basil and kuśa grass (should be kept) on the righthand side for being offered at the foot. The madhuparka[3] is also placed on the right side.
23. The kaṅkola, cloves and nutmeg along with the dūrvā grass and unbroken rice (should be offered) in the fire on the north for the sake of rinsing the mouth.
24. A vessel for offering camphor and perfumes to be applied on the body should be placed on the south-east. A vessel containing perfumes and flowers should be placed on the north-east.
25. The murā, māṃsī, myrabolan, sahadevā and niśā and sixty lamps should be placed. Eight lamps should be kept for the nirājana (showing the light in adoration).
26. The conch, disc, śrīvatsa (mark on the breast of Viṣṇu), thunderbolt, lotus etc. should be placed in a golden vessel along with flowers of variegated colours.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comentários