top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 189 / Agni Maha Purana - 189


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 189 / Agni Maha Purana - 189 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 58


🌻. స్నపనాది విధానము - 1 🌻


హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఆచార్యుడు ఈశాన్యము నందు ఒక హోమకుండము నిర్మించి దానిలో వైష్ణవాగ్నిని స్థాపింపవలెను. గాయత్రీ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి సంపాతవిధిచే కలశలను ప్రోక్షించవలెను. మూర్తి పాలకులగు విద్వాంసులతోడను, శిల్పులతోడను కలిసి యజమానుడు, వాద్యములతో, శిల్పశాలకు వెళ్ళవెలను. అచట "విష్ణవేశిపివిష్టాయనమః" అను మంత్రముచ్చరించుచు, ఇష్టదేవతా ప్రతిమ కుడిచేతికి కౌతుక సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆచార్యుని హస్తమునకు గూడ ఉన్నిదారము, ఆవాలు, పట్టు వస్త్రము వీటితో కౌతుకము కట్టవలెను మండలముపై ఆప్రతిమను వస్త్రముచుట్టి స్థాపించి ఈ విధముగ స్తుతించవలెను.


"విశ్వకర్మ నిర్మించిన, దేవేశ్వరి యైన ఓ ప్రతిమా! నీకు నమస్కారము సమస్త జగత్తును ప్రభావితము చేయు ఓ జగదంబా! నీకు మాటిమాటికి నమస్కిరించుచున్నాను. ఈశ్వరీ! నేను నీపై నిరామయుడగు నారాయణుని పూజించుచున్నాను. నీ యందు శిల్పసంబధి దోషములేవియు లేకుండగాక. నా విషయమున సర్వదా సమృద్ధి శాలినివిగా ఉండుము". ప్రతిమను ఈ విధముగ ప్రార్థించి దానిని స్నానాగారమునకు తీసికొని వెళ్ళవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 189 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 58


🌻Consecration of the idol (snāna) - 1 🌻


The lord said:


1-3. The priest should get ready a pit (for sacrificial fire) in the north-east. The fire relating to Viṣṇu should be kindled with (the recitation) of gāyatrī[1] one hundred and eight times. Having cleansed the pitchers thoroughly and established (the priest) he should go to the shed where the image has been made ready accompanied by the sculptors and custodians of the idol and along with music of (the instrument) tūrya. The woollen thread containing mustard seeds should be tied on the right arm (of the idol) with the syllables Viṣṇave śipiviṣṭāya[2] etc. The priest should also have a piece of silk cloth tied (to his arm).


4-5. Having placed the idol in the pavilion and having adored and worshipped the dressed idol (one has to say) “I bow to you the sovereign lady of celestials who has been made (ready) by Viśvakarman (the divine architect).” I make obeisance to you who is resplendant and is the sustainer of the entire universe. I worship in you the healthy Lord Nārāyaṇa.


6. Be thou always prosperous (goddess) devoid of defects due to the sculptors. Having submitted thus that idol should be carried to the bathing pavilion [i.e., snāna-maṇḍapa].



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page