top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 191 / Agni Maha Purana - 191


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 191 / Agni Maha Purana - 191 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 58


🌻. స్నపనాది విధానము - 3 🌻


"యఓషధీః" ఇత్యాది మంత్రము చదువును ఓషధి మిశ్రజలము చేతను, యజ్ఞా యజ్ఞా" ఇత్యాది మంత్రము చదువుచు ఉసిరి మొదలగు కషాయ పదార్థములు కలిపిన జలములచేతను, "పయః పృథివ్యామ్‌" ఇత్యాది మంత్రముతో పంచగవ్యముల చేతను, "యాఃఫలినీః" ఇత్యాది మంత్రముతో ఫలిమిశ్రిత జలములచేతను స్నానము చేయించవలెను. "విశ్వతశ్చక్షుః" ఇత్యాది మంత్రముతో ఉత్తరదిక్కుననున్న కలశ చేతను. "సోమం రాజనమ్‌" అను మంత్రముతో పూర్వదిక్కలశముచేతను, "విష్ణారరాటమసి" ఇత్యాది మంత్రముతో దక్షిణకలశ చేతను, "హంసః శుచిషత్‌" ఇత్యాది మంత్రముతో పశ్చిమముననున్న కలశచేతను ఉద్వర్తన స్నానము చేయించవెలను.


"మూర్ధానందివో" ఇత్యాది మంత్రముతో ఉసిరికాయతో కూడిన జలముచేతను, "మానస్తోకే" ఇత్యాది మంత్రముతో జటామాంసికలసిన జలముచేతను, "గన్దద్వారామ్‌ " ఇత్యాది మంత్రముతో గంధమిశ్రిత జలముచేతను, "ఇంద్రమాప" ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందుంచిన కలశలముచేతను స్నానము చేయించవలెను. స్నానానంతరము - "సమస్త లోకములను అనుగ్రిహించు భగవంతుడవైన మహావిష్ణూ! రమ్ము, రమ్ము, ఈ యజ్ఞభాగమును గ్రహింపును. మీకు నమస్కారము " అని ప్రార్థించుచు దేవేశ్వరుని ఆవాహనము చేసి, "మఞ్చామిత్వా" ఇత్యాది మంత్రము చదువుచు విష్ణు విగ్రహహస్తమునకు క్టటిన కౌతుక సూత్రమును, ఆచార్యుని చేతికి కట్టిన సూత్రమును కూడ విప్పివేయవలెను. పిమ్మట "హిరణ్మయేన" ఇత్యాది మంత్రముతో పాద్యము "అతోదేవా!" ఇత్యాది మంత్రముతో అర్ఘ్యము, "మధువాతాః" ఇత్యాది మంత్రముతో మధుపర్కము ఇచ్చి "మయిగృహ్ణామి" ఇత్యాదిమంత్రముతో ఆచమనము చేయించవలెను. పిమ్మట విద్వాంసుడు "అక్షన్నమీమదన్త" ఇత్యాది మంత్రము చదువును శ్రీమహావిష్ణువు ఆవయవములపై దూర్వలు, అక్షతుల చల్లవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 191 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 58


🌻Consecration of the idol (snāna) - 3 🌻


15. (The image should be bathed) with herbal waters (with the syllable) tadviṣṇoḥ[13] and yā oṣadhī,[14] with herbal decoctions (with the syllable) yajñā-ajñā[15] and then with the pañcagavya (the five things got from a cow).


16. (The image should be bathed) with the waters containing fruits (with the syllables) payaḥ pṛthivyām[16] and yāḥ phalinī[17] and with (the contents of) the pitchers (kept in) the north and east with (the syllables) viśvataścakṣuḥ.[18]


17. The cleansing (of the image) of Hari (Viṣṇu) should be done with (the recitation of the syllables somaṃ rājānam, viṣṇo rarāṭamasi[19] from the right and with haṃsaḥ śuci[20] on the west.


18. One should offer the dhātrī and māṃsī (herbs) on the head with the sacred syllables mūrdhānaṃ divā[21]. (One should bathe the image) with perfumes with the syllables gandhadvāra and mā nas toka.[22]


19. (One has to pour over its head the contents of the pitchers) placed in the eighty-one squares (with the syllables) idam ȧpaḥ. O Lord Viṣṇu! the bestower of grace on the universe! you come.


20. (You) accept this share in the sacrificial offerings. O Vāsudeva! Salutations to you! Having invoked the lord in this way, the wrist thread (on the hand of the image) should be unfastened.


21. The wrist thread on (the hand of) the priest should also be unfastened with the hymn muñcāmi tvā.[23] The water for washing the feet should be offered with (the syllable) hiraṇmaya[24] and the offering with ato devā.[25]


22. The madhuparka (should be offered) with (the syllables) madhuvātā[26] and the ācamana (the ceremonial sipping of waters at the commencement of any rite) should be done with mayi gṛhṇāmi.[27] The learned (priest) should scatter the unbroken rice-with (the syllable) akṣannamīmadanta.[28]



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page