top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 192 / Agni Maha Purana - 192


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 192 / Agni Maha Purana - 192 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 58


🌻. స్నపనాది విధానము - 4 🌻


"కాండాత్‌ " ఇత్యాది మంత్రముతో నిర్మంథనము చేసి, "గంధవతీ" ఇత్యాది మంత్రముతో గంధమును, "ఉన్నయామి" ఇత్యాది మంత్రముతో పుష్పమాలను, "ఇదం విష్ణుః " ఇత్యాది మంత్రముతో పవిత్రకమును అర్పింపవలెను. "బృహస్పతే" ఇత్యాది మంత్రముతో వస్త్ర ద్వయమును, "వేదాహ మేతమ్‌" ఇత్యాది మంత్రముతో ఉత్తరీయమును "మహావ్రతేన" ఇత్యాది మంత్రముతో పుష్పములను, ఓషధులను సమర్పింపవలెను. పిమ్మట "ధూరసి" అను మంత్రముతో ధూపము అర్పించి, 'విరాట్‌' సూక్తముతో అంజనమును, 'యజ్జన్తి' ఇత్యాది మంత్రముతో తిలకమును ఇవ్వవలెను.


"దీర్ఘాయుష్ట్వాయు" అను మంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. 'ఇన్ద్రక్షత్రమభి' ఇత్యాది మంత్రముతో ఛత్రమును, 'విరాట్‌' మంత్రముతో అద్దమును, 'వికర్ణ' మంత్రముతో చామరమును, రథంతర మంత్రముతో అలంకారములను సమర్పింపవలెను. వాయుదేవతకు సంబంధించిన మంత్రములతో వింజామరను, "ముఞ్చామిత్వా" ఇత్యాది మంత్రముతో పుష్పములను సమర్పించి, ఓంకారముతో కూడిన పురుషసూక్తముతో శ్రీ హరిని స్తుతింపివలెను. ఈ వస్తువుల నన్నింటిని పిండి కాదులపైనను శివుడు మొదలగు దేవతలకును ఈ విధముగనే సమర్పింపవలెను. దేవతను పైకి ఎత్తు నపుడు సౌపర్ణ సూక్తమును పఠింపవలెను. "ప్రభోలెమ్ము" అని పలుకుచు శ్రీమహావిష్ణువును ఎత్తి శకుని సూక్తము పఠించుచు మండపము నందలి శయ్యమీదకు తీసికొని వెళ్ళవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 192 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 58


🌻Consecration of the idol (snāna) - 4 🌻


23. The image should be rubbed part by part and perfumes (should be offered) with (the syllable) gandhavat [?note?], garland with (the syllable) unnayāmi and the sacred thread with (the syllable) idaṃ viṣṇu.


24. Pair of cloth pieces (should be offered) (with the syllable) bṛhaspate (and) the upper cloth (with the syllable) vedāham. The herbs and the flower of concluding worship should.. be placed with the mahāvrata.


25. Incense should be offered with dhūrasi and the collyrium (to the eyes of the image) with the hymn (called) vibhrāṭ. The mark on the forehead (should be made) with (the syllable) yuñjanti and the garland (should be offered) with dīrghāyuṣṭvā.


26. (One should offer) an umbrella with (the syllable) indra cchatra, mirror with virāja, the chowrie with vikarṇa and_ the ornaments with rathantara.


27. (One should offer) the fan with (the syllable) vāyu daivatya and flowers with muñcāmi tvā. One should sing in praise of (Lord) Hari (Viṣṇu) with vedic hymns and (the hymn called) puruṣasūkta.


28. All these rites should be performed similarly relating to pedestals of Hara (Śiva) and other gods. The hymn (called) sauparṇa should be recited at the time of raising (the image of) the deity.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹


Comments


bottom of page