🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 194 / Agni Maha Purana - 194 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 59
🌻. అధివాసనము - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు అధివాసనమని పేరు. "నేను సర్వజ్ఞుడు సర్వవ్యాపియు అయిన పురుషోత్తముడను" అని భావన చేయుచు సాధకుడు ఓంకారవాచ్యుడగు పరమాత్మతో ఏకత్వమును చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరుచేసి ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి స్వత్మరూపుడును, సర్మవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపివేయవలెను. పిమ్మట ప్రాణ వాయువు ద్వారా (లం బీజరూపయగు) పృథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయవలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు లీనము చేయవలెను అధిభూత-అథ్యాత్మ-అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మాత్రలలో విలీనము చేసి వీటినన్నింటిని క్రమముగా ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకశమును మనస్సునందు మనస్సును అహంకారమునందు అహంకారము మహత్తత్త్వమునందు, మహత్తత్త్వమును అవ్యాకృతప్రకృతియందును లీనము చేయవలెను.
అవ్యాకృతమును (ప్రకృతిని లేదామాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు వినీనము చేయవలెను. ఈ పరమాత్మమే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆవాసుదేవుడు నృష్టిచేయవలెనని సంకల్పించి, అవ్యాకృత మాయా శ్రయము చే స్పర్శమను పేరు గల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను క్షుబ్ధముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్ధుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచారమేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవశక్తియే. జీవశక్తితో ప్రాణమునకు సంయోగమేర్పడినప్పుడు అది 'వృత్తిమతి' అని చెప్పబడును. వ్యాహృతిసమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి అధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ధి పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులుండును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 194 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 59
🌻Preliminary consecration of an image (adhivāsana) - 1 🌻
The Lord said:
1-4. The act of causing the presence of God Hari is said tobe the adhivāsana (preliminary consecration). Having contemplated on the self as the omniscient, all-pervasive and supreme spirit and having united one’s self-conceited conscious energy with (the syllable) oṃ and after having drawn it out and identifying one’s own self with the all-pervasive lord, (the priest) should unite the earth with the wind, illuminate it with the fire particle (mentally), draw the fire with the wind (particle) and lead the wind into the ethereal space. The wiseman should draw in the same order (the other gross elements) after having made them the receptacles of subtle principles along with the gross principles, the supreme being and the secondary forms such as the sādhyas[1].
5. The ethereal space should be drawn into the mind (principle), the mind (in its turn) should be (drawn) into (the principle of) ego, (the principle) of ego in the (principle of) mahat (first principle). The mahat should be led into the avyākṛta (unmanifest).
6-7. The unmanifest (is led) into the absolute knowledge known as Vāsudeva. Being desirous to create he, the Lord of sound by means of the unmanifest brought into being Saṅkarṣaṇa (the principle) known as touch. He created Pradyumna the form of splendour by agitating the illusion.
8. He created Aniruddha, (consisting of) taste only and Brahmā of the form of smell. That Aniruddha, the Brahmā created water at first.
9. He also laid the golden egg (of the five principles) in that (water). Impregnated with consciousness (this generated) a peculiar force within.
10. The breath united with life force is spoken as existence. The inner being also known as the vyāhṛti[2] is a spiritual entity amidst the five winds (prāṇāḥ [=prāṇa]).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments