🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 200 / Agni Maha Purana - 200 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 59
🌻. అధివాసనము - 7 🌻
ఒక్కొక కుండములో ఓంకారోచ్చారణ పూర్వకముగ ఒక వెయ్యి ఎనిమిది చొప్పున పలాశసమిధలను యవలు మొదలగు వాటిని హోమము చేయవలెను. వ్యాహృతి మంత్రముతో ఘృతమిశ్రతిలలను, మూలమంత్రముతో ఘృతమును హోమము చేయవలెను. పిమ్మట మధురత్రయము (నెయ్యి, తెనె, పంచదార)తో శాంతిహోమము చేయవలెను. ద్వాద శాక్షర మంత్రముతో పాదనాభి-హృదయ-శిరస్సులను స్పృశింపవలెను. నెయ్యి, పెరుగు, పాలు హోమము చేసి శిరస్సు స్పృశింపవలెను. పిమ్మట శిరో-నాభి-పాదములు స్పృశించి గంగా-యమునా-గోదావరి-సరస్వతీ నదులను ఆవాహనము చేయవలెను. విష్ణుగాయత్రితో అగ్నిని రగిల్చి, గాయత్రితో ఆ అగ్నిపై చరువును వండవలెను.
గాయత్రీ మంత్రముతో హోమము చేసి, బలు లిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. మాసాధీపతులైన ద్వదశాది దిత్యుల తుష్టికై ఆచార్యునకు బంగారము, గోవు దక్షిణగా ఈయవలెను. దిక్పాలకులను బలి ఇచ్చి. వేదపాఠ - గీత కీర్త నాదులతో రాత్రి జాగరణము చేయవలెను. ఈ విధముగ ఆధివాసనము పూర్తి చేసినవానికి అన్ని ఫలములును లభించును.
అగ్ని మహాపురాణమునందు అధివాసన మను ఏబది తొమ్మిదవ అద్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 200 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 59
🌻Preliminary consecration of an image (adhivāsana) - 7 🌻
52. One should place one thousand and eight twigs of the palāśa tree in each one of the fire pits and offer grains with vedic hymns.
53. Clarified butter and sesamum (should be offered to fire) with the vyāhṛtis (Oṃ bhūḥ, bhuvaḥ, suvaḥ) and ghee with the principal mantra. One should perform the appeasing oblation with the three sweet things.[13]
54. One should then touch the feet, navel, heart and forehead with (the utterance of) twelve mystic syllables (of the god). After having offered ghee, curd and milk, the head of the image should again be touched.
55. After having touched the head, navel, and feet, (the priest) should make four rivers Gaṅgā, Yamunā, Godāvarī and Sarasvatī present there by pronouncing their names.
56. (The rivers) should be dried up by (the recitation of the viṣṇugāyatrī[14] and the sacrificial gruel should be boiled with (the recitation of) the gāyatrī. One should offer oblation, offer the victim and feed the twice-borns afterwards.
57. For the satisfaction of the singer of sāmans one should give gold and cows to the spiritual preceptor. Having made offerings to the guardian deities of the quarters, one should spend night in vigil. By singing the praise of the brahman one gets fruits of the consecration rite.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments