top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 202 / Agni Maha Purana - 202


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 202 / Agni Maha Purana - 202 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 60


🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 2 🌻


హోమము కొరకు ఇసుకతో ఒకటన్నర హస్తము విస్తారము గల, చతురస్రము, సుందరము అగు వేదిని ఏర్పరుపవలెను. ఎనిమిది దిక్కులందును. యథాస్థానమున కలశము లుంచవలెను. ఆ పూర్వాది కలశలకు ఎనిమిది రంగులు వేయవలెను. పిమ్మట అగ్నిని వేదిపై స్థాపించి, కుశలతో సంస్కారము చేసి 'త్వమగ్నేద్యుభిః" అను మంత్రముతోను, గాయత్రీ మంత్రముతోను సమిధులను హోమము చేయవలెను. అష్టాక్షరమంత్రముతో నూట ఎనిమిది అజ్యాహుతులుచేసి, పూర్ణహుతి ఇవ్వవలెను.


పిమ్మట నూరు పర్యాయములు మూలమత్రము జపించి అభిమంత్రించిన శాంత్యుదకమును మామిడి చిగుళ్ళతో ఇష్టదేవత శిరస్సుపై చల్లవలెను. ఆ సమయమున "శ్రీచ్చ లక్ష్మీశ్చ" ఇత్యాది మంత్రము పఠింపవలెను. "ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే" అను మంత్రముతో ప్రతిమనుపైకి ఎత్తి, బ్రహ్మ రథముపై నుంచి, "తద్విష్ణో" ఇత్యాదిమంత్రము పఠించుచు దేవాలయము వైపు తీసికొని వెళ్ళవలెను. అక్కడ శ్రీహరి ప్రతిమను పల్లకీపై ఎక్కించి నగరమునందు, గీత-వాద్య వేదమంత్రాది ధ్వనులతో ఊరేగించి, తిరిగి దేవాలయద్వారమువద్దకు తీసికొనిరావలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 202 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 60


🌻Mode of installation of the image of Vāsudeva - 2 🌻


8. The ground for kindling the sacrificial fire should be made ready with sand. An excellent site should be of the measure of a. cubit and a half on all sides.


9. The pitchers also should be placed in the eight directions commencing with the east. The consecrated fire should be brought in uttering the eight letters (described already).


10. The twigs should be offered into the fire with (the mantras)—tvam agne dyubhiḥ[1] and gāyatrī. Clarified butter should be offered with (the recitation of) eight letters, eight hundred times.


11. The appeasing water sanctified hundred times by the principal mantra should be sprinkled on the head of the image with (the recitation of) the hymn śrīśca te.[2]


12. The image should be lifted up with (the mantra) brahmajajñāna[3] and should be led to the temple with the mantra uttiṣṭha brahmaṇaṣpate[4] and tadviṣṇoḥ[5].


13. Lord Hari should be placed in a palanquin and carried towards the divine edifice accompanied by songs and vedic hymns. He should be held at the gates of the temple.


14. Lord Hari should be bathed with waters from eight auspicious pitchers by women and brahmins. Then the priest should worship the image with perfumes etc. and with the principal mantra[6].



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page