top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 203 / Agni Maha Purana - 203


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 203 / Agni Maha Purana - 203 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 60


🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 3 🌻


పిమ్మట గురువు సువాసినీస్త్రీల చేతను, బ్రహ్మణుల చేతను, ఎనిమిది మంగళకలశముల ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించి మూలమంత్రోచ్చారణ, పూర్వకముగ గంధాద్యుపచారములు సమర్పించి పూజచేసి "అతో దేవాః" ఇత్యాది ఋక్కు చదువుచు వస్త్రాక్యష్టాంగార్ఘ్యము ఇవ్వవలెను. పిమ్మట స్థిరలగ్నమున " దేవస్యత్వా" ఇత్యాదిమంత్రము చదువుచు ఆ అర్చావిగ్రహమును ప్రతిష్ఠ చేయవలెను. "సచ్చిదానంద స్వరూపా! త్రివక్రమా! నీవు మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించితివి. నీకు నమస్కారము" అని ప్రార్థింపవలెను. ఈ విధముగ పండితుడు ప్రతిమను పిండిక మీద స్థాపించి, "ద్రువాద్యౌః" "విశ్వతశ్చక్షుః" ఇత్యాదిమంత్రములు చదువుచు స్థిరము చేయవలెను. పంచగవ్యములతో స్నానము చేయించి, గంధోదకముదో ప్రతిమా ప్రక్షాళనము చేసి, సకలీకరణానంతరము, శ్రీహరికి సాంగోపాంగసాధారణపూజ చేయవలెను.


ఈ విధముగ ధ్యానించవలెను - "ఆకాశము శ్రీ మహావిష్ణువుయొక్క విగ్రహము; పృథివి అతని పీఠము (సింహాసనము)." పిమ్మట పరమాత్ముని శరీరము తైజసపరమాణువులతో ఏర్పడి నట్లు భావన చేయుచు ఇట్లు చెప్పవలెను. - ఇరువదియైదు తత్త్వములలో వ్యాపించి యున్న జీవుని అవాహన చేయుచున్నాను. ఆ జీవుడు చైతన్య స్వరూపుడు పరమానందరూపుడు; జాగ్రత్స్వప్న సుషుప్త్వవస్థాశూన్యుడు. దేహేంద్రియ - మనో - బుద్ధి - ప్రాణ - అహంకారరహితుడు. బ్రహ్మ మొదలు కీటకము వరకును ఉన్న సకలజగత్తునందును వ్యాపించి, అదరి హృదయములలో ఉన్నవాడు.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 203 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 60


🌻Mode of installation of the image of Vāsudeva - 3 🌻


15. Then the dress, the devotional offerings of eight kinds should be offered with (the mantra) ato devā[7]. (The image) should be fixed on the pedestal at the fixed moment with (the recitation of) devasya tvā[8].


16. The learned (priest) should fix the image on the pedestal (with the recitation of the following mantra). “O Conqueror of three spaces! Oṃ! salutations to you who surpassed the three regions”.


17. The image should be bathed with the pañcagavya (five things got from a cow) with (the recitation of) the mantra dhruvā dyauḥ[9] and viśvatascakṣuḥ[10] and bathed again with perfumed water.


18. Lord Hari should be worshipped along with the attendants and paraphernalia. The heavens should be contemplated as his form and the earth as the seat.


19. His body should be imagined as composed of lustrous minute particles. (One should say), “I am invoking his spirit pervading the twenty-five principles.”



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page