top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 204 / Agni Maha Purana - 204


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 204 / Agni Maha Purana - 204 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 60


🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 4 🌻


పరమేశ్వరా! నీవే ఆ జీవచైతన్యము. నీవు హృదయమునుండి ప్రతిమలో ప్రవేశించి స్థిరముగా నుండుము. ఈ ప్రతిమను సజీవము చేయుము. అన్ని దేహములందును అంగుష్ఠమాత్రపురుషుడున్నాడు. అతడు జ్యోతిఃస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు; ఏకమాత్ర అద్వితీయపరబ్రహ్మ" ఈవిధముగ ప్రతిమను సజీవము చేసి ప్రణపముతో భగవంతుని మేల్కొల్పవలెను. పిదప భగవంతుని హృదయము స్పృశించి పురుషసూక్తమును జపించవలెను. దీనికి సానిధ్యకరణకర్మ" యని పేరు భగవద్ధ్యానము చేయుచు ఈ రహస్యమంత్రమును పఠింపవలెను


"ప్రభూ! నీవు సకలదేవాధీసుడవు. సంతోషవైభవస్వరూపుడవు. నీకు నమస్కారము. జ్ఞానవిజ్ఞానములు నీ స్వరూపము. త్రిగాణాతీతము. నీవు అంతర్యామివి; పరమాత్మవు. నాశరహితు డగు పురాణపురుషుడవు. నీకు నమస్కారము. మహావిష్ణూ! నీ విచట సంనిహితుడవు కమ్ము. నీ పరమతత్త్వము, జ్ఞానమయశరీరము ఒక సంఘాతముగ ఏర్పడీ ఈ అర్చావిగ్రహమునందు అవిర్భూతమగు గాక". ఈ విధముగ శ్రీహరి సాంనిధ్యకరణము చేసి అతని ఎదుట బ్రహ్మదిపరివారదేవతలను స్థాపింపవలెను. వారి ఆయుధములను ముద్రలను కూడ స్థాపింపవలెను. శ్రీహరిదరశనార్థమై వచ్చువారియాత్రలను బట్టియు. వర్షాదులను బట్టియు శ్రీహరి అచట సన్నిహితుడై యున్నాడను విషయమును గ్రహింపవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 204 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 60


🌻Mode of installation of the image of Vāsudeva - 4 🌻


20-21. O Supreme Lord! you become firmly established in the image. I invoke you, the spirit of supreme happiness, one devoid of (three states) waking, dreaming and deep sleep, one who is devoid of a body, sense-organs, intellect, life and egoism, and one who resides in the hearts of all beings beginning with Brahman and ending with a dump of grass.


22. You make the image imbued with your soul both inside and outside. You have taken your abode in this image (of the size of) a thumb with attributes.


23. Having invoked (the god in the image), the supreme brahman, lustrous form of knowledge and who is one without a second, that is deemed as alive by the use of (the mantra) Oṃ.


24. The act of bringing the god near consists in uttering (the mantra) and touching the heart (of the image). (The priest) should recite the puruṣasūkta[11] and should recite the following (mantra) in secret.


25-27. Salutations to the Lord of celestials who is of the form of happiness and fortune, of the form of knowledge and wisdom and who attends on the lustre of the supreme brahman. (Salutations to) the one who is beyond properties, the great being, devoid of decay, old age. O Viṣṇu, you be present here. Whichever is the supreme principle in you and that which is your form verily (made up) of knowledge, all that be present here in this form. May you awake!


28. Stationing oneself in from of the deity, (the priest) should establish Brahman and other attendant gods as well as the respective weapons (by showing) the mudrā (different postures shown with the hand).



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page