🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 210 / Agni Maha Purana - 210 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 61
🌻. ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః - 5 🌻
దండముపై జీవసహితు డగు సూత్రాత్మను న్యాసము చేయవలెను. ధ్వజముపై, శ్రీహరిధ్యానము చేయుచు, నిష్కలపరమాత్ముని స్థాపించపవలెను. అతని బలాబలరూపవ్యాపకశక్తిని ధ్వజరూపమున ధ్యానింపవలెను. మండపముపై దానిని స్థాపించి, పూజించి, కుండములలో హోమము చేయవలెను. కలశములో బంగారు ఖండము, పంచరత్నములు ఉంచి, అస్త్రమంత్రముతో చక్రమును స్థాపింపవలెను. పిమ్మట సువర్ణచక్రమును, క్రింద నున్న పాదరసములో ముంచి నేత్రపటముతో కప్పవలెను. పిమ్మట చక్రము నుంచి, దాని మధ్యమున శ్రీహరిని స్మరింపవలెను.
"ఓం క్షౌం నృసింహాయ నమః" అను మంత్రముతో హరిని స్థాపించి పూజిచంవలెను. పిమ్మట యజమానుడు, బంధుసమేతుడై ధ్వజము తీసికొని దాని అగ్రభాగమును పెరుగుపాత్రలో ముంచవలెను. 'ఓం ఫట్' అను మంత్రముతో ధ్వజపూజ చేయవలెను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకొని నారాయణస్మరణ చేయుచు వాద్యధ్వనులతో, మంగళపాఠములతో, పరిక్రమణము చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ధ్వజదండమును స్థాపించవలెను. "ముఞ్చామి త్వా" ఇత్యాదిసూక్తము చదువుచు ధ్వజములు విడువ (ఎగురువేయ) వలెను. ఆచార్యునకు పాత్ర-ధ్వజ-గజాదులు దానము చేయవలెను. ఇది ధ్వజారోపణసాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును, ఆ దేవాతామంత్రముతో స్థిరముగ స్థాపింపవలెను. ధ్వజదానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళును; ఈ లోకమునందు బలవంతు డగు రాజగును.
శ్రీఅగ్నిమహాపురాణమునందు ద్వార ప్రతిష్ఠా ద్వజారోహణాదివిధి యను ఆరువదియొకటవ అద్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 210 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 61
🌻Consecration of doors of the temple and the erection of banner - 5 🌻
41. The sakala (endowed with parts) forms should be assigned to the staff as the living soul of it. Lord Hari, the supreme being of the niṣkala (undivided) form should be contemplated and assigned to the flag.
42. The energies Bala and Abala which manifest in the form of the banner should be contemplated. Having placed it in the shed and worshipped it, oblation should be made in the pit.
43. Having placed the golden pitcher over the pitcher and putting five (kinds of) gems (at the top of the temple) a golden disc should be placed underneath that with the mantra of the disc.
44. The disc should be washed with mercury and covered with the eye-cover. The disc should then be placed. Lord Nṛhari (man-lion form of Viṣṇu)should be imagined there in the middle.
45-46. Oṃ, kṣauṃ, salutations to Lord Nṛsiṃha. Lord Hari should be invoked and worshipped. Then the yajamāna (the person who has arranged for the consecration) accompanied by his relatives should hold banner and dip the tip of the banner in a vessel full of curd. The banner should be worshipped with the mantra commencing with dhruvā[4] and ending with phaṭ.
47. Holding that vessel on the head and remembering Lord Nārāyaṇa (the yajamiina) should go around the temple along with auspicious sounds from the tūrī (a musical instrument).
48. The staff should then be placed with (the recitation of) the eight-syllabled mantra[5]. Then the flag should be (hoisted) and unfurled with (the recitation of) the hymn muñcāmi tvā[6] by the learned person.
49. The twice-born (yajamāna) should give the priest the vessel, banner and elephant etc. Mode of consecration of the flag has been thus described in general.
50. The mark which represents a particular god should be planted with the respective mantra. By the offer of a banner one goes to heaven and becomes a strong monarch on the earth (in the next birth).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments