🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 213 / Agni Maha Purana - 213 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 63
🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: గరుడ - సుదర్శన - బ్రహ్మ-నృసింహమూర్తుల ప్రతిష్ఠకూడ, వారి వారి మంత్రములతో, విష్ణుమూర్తిని స్థాపించిన విధముననే స్థాపింపవలెను. ఆ విధానమును వినుము " ఓం సుదర్శన....సుదర్శనాయ నమః" అను (మూలములో వ్రాసిన) మంత్రముతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధమునందు శత్రువులను చీల్చివేయగలడు "ఓం క్షౌ నరసింహ ఉగ్రరూప జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్వాహా" అనునది నరసింహా మంత్రము. ఇపుడు నీకు పాతాలనృసింహ మంత్రము పదేశించుచున్నాను.
ఇది పాతాలనృసింహమంత్రము దీనిని ఈ విధముగ జపించగనే సత్ఫలము లభించును. శత్రువులను, నాకు అపకారము చేయు అసురులు మొదలగువారిని, పరులు ప్రయోగించిన మంత్రములను నశింపచేయుము. అని దీని తాత్పర్యము. మధ్యనున్న 'హుం' 'ఫట్' అనువాటికి ప్రత్యేకముగ అర్థమేమియు ఉండదు. కాని ఉచ్చారణమాత్రముచేతనే అవి నశింపచేయుట అను అర్థమును సూచించును 'ఫట్' అనుదానికి మారకాస్త్రమని పేరు.]
"ప్రకాశించుచున్న కోటిసహన్రసూర్యలతో సమాన మైన తేజస్సు కలవాడును, వజ్రము వంటి నఖములు కోరలు ఆయుధముగా కలవాడును, పైకి విడివడి లేచిన జూలుచేత క్షోభింపచేయబడిన మహాసముద్ర జలముచే ఏర్పడిన దుందుభిధ్వని కలవాడును, సర్వమంత్రప్రయోగములనుండి తరింపచేయువాడును అగు భగవంతుడైన నరసింహునకు నమస్కారము భగవంతుడవైన నరసింహా! రమ్ము; రమ్ము. పురుషా! పరాపరబ్రహ్మరూపా! సత్యముచే ప్రకాశించుము ప్రకాశించుము. విజృంభించుము, విజృంభించుము. ఆక్రమించుము, అక్రమించుము గర్జించుము, గర్జించుము. సింహనాదము చేయుము, చేయుము. చీల్చుము, చీల్చుము, పారద్రోలుము, పారద్రోలుము, ఆవేశించుము, ఆవేశించుము. సర్వ సంత్రరూపములను, మంత్రజాతులను చంపుము, చంపుము. భేదించుము, భేదించుము. సంక్షేపించుము, సంక్షేపించుము. నడుపుము, నడుపుము. చీల్చుము, చీల్చుము. బ్రద్దలుకొట్టుము, బ్రద్దలుకొట్టుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 213 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 63
🌻Mode of installation of other Gods and Goddesses - 1 🌻
The god said:
I. The installation [i.e., pratiṣṭhā] of the (images of) Garuḍa (vehicle of Viṣṇu) Brahman, Nṛhari (man-lion form of Viṣṇu) and of the (sudarśana) disc should be done in the same way as that of Viṣṇu with their respective mantras. Listen to me.
2. O Sudarśana! The great disc that is tranquil! Dreadful to the wicked! Kill kill, pierce pierce, cut through and cut through.
3. Devour devour the incantations of others. Eat up, eat up the evil spirits. Frighten frighten, huṃ phaṭ, salutation to sudarśana. Having worshipped the disc with this mantra one destroys the enemies in the battle.
Oṃ kṣauṃ Narasiṃha (man-lion)! of fierce form! burn, burn, blaze up, blaze up, svāhā. Oṃ kṣauṃ salutations to lord Narasiṃha! Effulgent like crores of radiant suns! One armed with mace, claws and teeth! One who manifests with a sound similar to the trumpet while the dreadful and dishevelled manes wildly dance in the storm and one who has agitated the ocean! One who rescues from all incantations! O Lord Narasiṃha (you) come! Manifest with the divine truth as the universal subjective and objective! Open thy mouth! Attack! Roar and release your lion-like voice! Cut through! Drive away! Pierce into all sorts of incantations! Kill, cut, heap together, dislodge, cut open, break up, cause to be burst!
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments