top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 215 / Agni Maha Purana - 215


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 215 / Agni Maha Purana - 215 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 63


🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 3 🌻


ఇపుడు నేను గ్రంథప్రతిష్ఠను దానిలేఖన విధానమును గూర్చి చెప్పెదను. ఆచార్యుడు స్వస్తికమండలముపై శరయంత్రా సనము మీద నున్న లేఖ్యమును (వ్రాయదగిన దానిని) లిఖిత పుస్తకమును. విద్యను, శ్రీహరిని పూజించవలెను. పిదప యజమానుడు గురువును, విద్యను, శ్రీ మహావిష్ణువును, లేఖకుని పూజించవలెను. పిమ్మట పూర్వాభిముఖుడై పద్మినిని ధ్యానించి వెండి సిరాబుడ్డిలో నున్న సిరాలో ముంచి బంగారు కలముతో ఐదు శ్లోకములు దేవనాగరీ లిపిలో వ్రాయవలెను.


పిదప బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి, దక్షిణ ఇవ్వవలెను. ఆచార్య-విద్యా-శ్రీ మహావిష్ణువులను వూజించి లేఖకుడు పురాణాదులను వ్రాయుట ప్రారంభింపవలెను. వెనుకటివలె మండలాదులపై ఈశాన్యము నందున్న అద్దముమీద పుస్తకము నుంచి, మొదట చెప్పినట్లుగనే కలశములచే తడపవలెను . పిదవ యజమానుడు నేత్రములను తెరచి, ఈ పుస్తకమును శయ్యపై ఉంచవలెను. పిమ్మట దానిపై పురుషసూక్తవేదాదిన్యాసము చేయవలెను. ప్రాణప్రతిష్ఠా పూజా-చరుహోమములు చేసి, పూజించి, ఆచార్యుని దక్షిణాదులతో సత్కరించి బ్రహ్మణ భోజనము ఏర్పరుపవలెను. అంతమున ఆ పుస్తకమును గృహమునందు గాని, దేవాలయమునంరు గాని స్థాపించి పూజించవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 215 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 63


🌻Mode of installation of other Gods and Goddesses - 3 🌻


10. Having worshipped the manuscript and the written book on a seat made of kuśa grass placed on a svastika figure, the preceptor should worship the spell and Lord Hari (Viṣṇu).


11-12. The yajamāna (the person at whose instance a rite is performed) should face the east and contemplate the spiritual guide, the spell, lord Hari, the copyist and (the goddess) Padminī after having written five verses on a silver plate with golden pen and devanāgarī letters. The brahmins should be fed according to one’s capacity and fees should be paid as much as one could give.


13. After having worshipped the preceptor, the spell and Lord Hari, one should write the purāṇas etc. as before in a figure in an auspicious seat in the north-east.


14. Having seen the book [i.e., pustaka] in the mirror in the pitcher it should be consecrated as (described) earlier. After opening up the eyes one should place it in the bed.


15. The puruṣasūkta[1] and the Vedas etc. should be (mentally) located in the book. After having infused life to it, it should be worshipped and the porridge offered.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Opmerkingen


bottom of page