🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 217 / Agni Maha Purana - 217 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 64
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! ఇపుడు కూపములు, దిగుడుబావులు, చెరువులు ప్రతిష్ఠచేయు విధిని చెప్పెదను; శ్రీహరియే జలరూపముచే దేవ శ్రేష్ఠుడైన సోముడుగాను, వరుణుడు గాను ఆయెను. ప్రపంచ మంతయు అగ్నిషోమమయము. జలరూపుడైన నారాయణుడు దానికి కారణము. బంగారముతో, లేదా వెండితో, లేదా రత్నములతో వరుణుని ప్రతిమ చేయించవలెను. వరుణదేవునకు రెండు భుజములతో, హంసారుఢుడై, నదులతోడను, కాలువలతోడను కూడియుండును. అతని కుడి చేతిలో అభయముద్రయు, ఎడమచేతిలో నాగపాశము ప్రకాశించుచుండును. యజ్ఞమండప మధ్యభాగమున కుండముతో ప్రకాశించు వేదిక నిర్మించి దాని తోరణమున పూర్వద్వారమున కమండలసహితముగా వరుణకలశము స్థాపింపవలెను, భద్రకమున (దక్షిణద్వారమున)ను, అర్ధచంద్రమునను (పశ్చిమద్వారముదను) స్వస్తికమునను (ఉత్తరద్వారమునను) వరుణగకలశములు స్థాపించవలెను. కుండమునందు అగ్న్యాధానము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను.
"యే తే శతం వరుణ" ఇత్యాదిమంత్రముతో స్నానపీఠముపై వరుణుని స్థాపింపవలెను. మూలమంత్రము నుచ్చరించుచు, ఆచార్యుడు, వరుణదేవతాప్రతిమకు ఘృతము పూయవలెను. "శం నో దేవీ" ఇత్యాదిమంత్రముతో ప్రక్షాళనముచేసి, "శుద్ధవాలః," "సర్వశుద్ధవాలః" ఇత్యాదిమంత్రములతో, పవిత్ర జలముచే స్నానము చేయించవలెను. పిమ్మట స్నానపీఠమునకు పూర్వాది దిక్కులందు కలశములను స్థాపించవలెను. తూర్పుననున్న కలశమున సముద్రజలము, అగ్నేయమున నున్న కలశమున గంగాజలము, దక్షిణ కలశమున వర్షాజలము, నైరృతికలశమున సెలయేరు నీరు, పశ్చిమకలశమున నదీజలము వాయవ్య కలశమున కొండకాలువ నీరు, ఉత్తరకలశమున కాలువల నీరు, ఈశాన్యకలశమున తీర్థజలములను ఉంచవలెను. ఈ వివిధజలములు లభించనిచో నదీజలమే ఉంచవలెను. ఈ అన్ని కలశములను "యాసాం రాజా" ఇత్యాది మంత్రముచే అభిమంత్రించవలెను. విద్వాంసుడైన పురోహితుడు "సుమిత్రయా" ఇత్యాది మంత్రముతో మార్జననిర్మంథనములు చేయవలెను. "చిత్రం దేవానామ్" "తచ్చక్షుర్దేవహితమ్" అను మంత్రములతో తేనె, నెయ్యి పంచదార అను మధురత్రయముచే నేత్రములను తెరువలెనుః ఆ సువర్ణమయ వరుణ ప్రతిమపై జ్యోతిస్సును పూజించి ఆచార్యునకు గోదాన మీయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 217 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 64
🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 1 🌻
The Lord said:
l. I shall describe the (mode of) consecration of wells, tanks and ponds [i.e., kūpa, kūpaka]. Listen! Lord Hari (Viṣṇu) as Soma and excellent Varuṇa remains in the form of water.
2. The universe is permeated by fire and water. Viṣṇu in the form of water is its cause. The image of Lord Varuṇa (the presiding deity of waters) should be made of gold, silver or gems.
3. (The image should have) two hands, the right conferring refuge and the left should hold the snake-noose and as seated on the haṃsa along with the rivers and serpents.
4. There should be an altar at the centre of sacrificial shed having a fire-pit. There should be an arch. A pitcher made of stone for Lord Varuṇa should be placed.
5. Pitchers (should be placed) at the entrance to the fire receptacle which may be of a semi-circular shape or a svastika of auspicious nature. Having done the agnyādhāna (rite) in the pit for water the final oblation should be done.
6. (The image of) Varuṇa should be touched in the bathing seat with (the mantra) ye te śate[1]. It should then be anointed with ghee by the priest with (the recitation of) the principal mantra.
7. Having washed the eight pitchers with pure water with (the recitation of) śaṃ no devī[2] they should be consecrated. Sea water (should be kept) in the eastern pitcher.
8-9. Having kept the Ganges water in the (pitcher on the) south-east, rain water in the (pitcher on the) south, water from waterfalls in the (pitcher on the south-west, river water in the west, water from a masculine river in the north-west, spring water in the north, waters from sacred places (should be kept) in the north-east. In the absence of all the above, river water (should be poured into these pitchers) with the chanting of yāsāṃ rājā[3].
10. After having cleansed and anointed the eyes with the three sweet things (honey, sugar and clarified butter) with (the mantra) durmitriya[4], they should be opened with Citram[5] and taccakṣuḥ[6].
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments