top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 218 / Agni Maha Purana - 218


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 218 / Agni Maha Purana - 218 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 64


🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 2 🌻


"సముద్రజ్యేష్ఠాః" ఇత్యాదిమంత్రముతో పూర్వకలశజలముచేతను, "సముద్రం గచ్ఛ" ఇత్యాదిమంత్రముతో అగ్నేయకలశస్థిత గంగాజలముచేతను. "సోమో ధేనుమ్‌" ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశస్థితి వర్షాజలము చేతను, "దేవీరాప," ఇత్యాదిమంత్రముతో నైరృతికలశస్థితి నిర్ఘర జలముచేతమ, ''పఞ్చ నద్యః'' ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశస్థిత నదీజలము చేతను, "ఉద్భిద్భ్యః" ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశస్థితోద్భిజ్జ జలముచేతను, పావమానీ ఋక్కులతో ఈశాన్యకలశస్థిత తీర్థజలముచేతను వరుణునకు అభిషేకము చేయవలెను.


పిమ్మట యజమానుడు 'అపోహిష్ఠా' మంత్రముతో పంగనవ్యముల చేతను, 'హిరణ్యవర్ణామ్‌' ఇత్యాదిమంత్రముతో స్వర్ణజలముచేతను, "ఆపో అస్మాన్‌" అను మంత్రముచే వర్షాజలముచేతను, వ్యాహృతులతో కూపజలముచేతను, "అపో దేవీః" ఇత్యాదిమంత్రముతో తడాగజలముచేతను, తోరణమునందున్న వరుణ కలశజలముచేతను వరుణునికి స్నానము చేయించవలెను. కొండకాలవల జలము నింపిన ఎనుబది యొక్క కలశములలోని జలముచే "వరుణస్యోత్తమ్భనమసి" ఇత్యాది మంత్రము పఠించుచు స్నానము చేయించవలెను. "త్వం నో అగ్నే వరుణస్య" ఇత్యాదిమంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. వ్యాహృతుల నుచ్చరించుచు మధుపర్కమును, "జృహస్పతే అతియదర్యో" ఇత్యాది మంత్రముతో, వస్త్రముతో, వస్త్రములను, "ఇమం మే వరుణ" ఇత్యాది మంత్రముతో పవిత్రకమును, ప్రణవ ముచ్చరించుచు ఉత్తరీయమును సమర్పింపవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 218 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 64


🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 2 🌻


11. Having invoked lustre in them the priest should be offered a golden cow. (The image of) Varuṇa should be consecrated with the (waters of the) pitcher on the east with (the recitation of) samudrajyeṣṭhā.[7]


12-13. The waters of the Ganges should be poured with (the mantra) samudraṃ gaccha[8], rain waters with somo dhenum[9], water from waterfalls with devīrāpa[10], the water of the masculine rivers with pañca nadyaḥ[11], the spring water with udbhid[12], the waters from sacred places with pāvamānī[13], the pañcagavya (the five things from a cow) with āpo hi ṣṭhā[14] and from the golden (pitcher) with hiraṇyavarṇām[15].


14. (The image should be bathed) with rain water with āpo asmā[16], with well waters [i.e., kūpa] with the vyāhṛtis (bhuḥ, bhuvaḥ, suvaḥ). (Image of) Varuṇa should be consecrated with the waters of the tank with varuṇādbhiḥ[18].


15. Waters from the hills (should be poured) with (the mantra) āpo devī[19] and then with the waters from eighty-one pitchers. Then (the image) should be bathed with varuṇasya[19] and waters for sipping (should be given) with tvanno varuṇa[20].


16-17. The madhuparka[21] should be given) with the vyāhṛtis,[22] clothes with bṛhaspat[23], pavitra with varuṇa[24], the upper garment with praṇava (Om).


Flowers etc. chowrie, mirror, umbrella, fan and banner should be offered to (the image of) Varuṇa with (the mantra) yadvāruṇya[25].


18. The image should be raised up with the principal mantra (saying) ‘Rise up’ and the preliminary consecration is made that night. The presence of divinity is accomplished by varuṇaṃ ca[26]. It should be worshipped with yadvāruṇya.[27]


19-20. Life should be infused into the image with the principal mantra and should again be worshipped with perfume etc. Having worshipped it well in the shed as before after having offered twigs etc. into the fire pits with (the recitation of the praṇava) the first word of the Vedas, four cows should be milched. in the four directions. Then gruel of barley should be prepared, and offered to the fire.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page