top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 220 / Agni Maha Purana - 220


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 220 / Agni Maha Purana - 220 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 64


🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 4 🌻


పిమ్మట వరుణదేవుని లేవదీసి మంగళ ద్రవ్యములతో గజ పృష్ఠాదులపై ఎక్కించి ఊరేగించవలెను. పిమ్మట ఆ వరుణమూర్తిని "ఆపో హి ష్ఠామ యో భువః" ఇత్యాది మంత్రము పఠించుచు మదురత్రయయుక్త మగు కలశములో ఉంచి కలశసహితు డగు వరుణుని జలాశయ మధ్య భాగమునందు సురక్షితరూపము స్థాపింపవలెను.


పిమ్మట యజమానుడు స్నానము చేసి వరుణుని ధ్యానించవలెను. అనంతరము బ్రహ్మాండసంజ్ఞక మగు సృష్టిని అగ్నిబీజముచే (రం) దహించి, దాని భస్మరాశిని ఉదకముచే ముంచెత్తి నట్లు భావన చేయవలెను. జగ మంతయు జలమయమైనది" అని భావన చేసి ఆ జలమునందు జలేశ్వరు డైన వరుణుని ధ్యానించవలెను. ఈ విధమున జల మధ్యభాగమున వరుణదేవతా ధ్యానము చేసి అచట యూపమును స్థాపించవలెను. యూపము చతుష్కోణముగ గాని, అష్ణకోణముగ గాని, గోలాకారము గాని ఉండుట మంచిది. పది హస్తముల పొడ వుండవలెను. దానిపై ఉపాస్యదేవతా చిహ్నము లుండవలెను. దానిని యజ్ఞమున కుపయోగించు చెట్టు కఱ్ఱతో నిర్మింపవలెను. కూపమునకు అట్టి యూపమే ఉపయోగించును. దాని మూలభాగమున బంగారు ఫలక ముంచవెలను. దిగుడు బావిలో పదునైదు హస్తముల యూపమును, పుష్కరిణిలో ఇరువది హస్తముల యూపమును, తటాకమున ఇరువదియైదు హస్తముల యూపముస్థాపించవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 220 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 64


🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 4 🌻


32. The image should be placed in the midst of the tank unseen. (The priest) should bathe and contemplate on Varuṇa, the creation known as the primordial egg.


33. Having purified it with the principal letter (of the mantra) of the fire, the ashes should be scattered over the earth. The entire world consists of water. Hence, the lord of waters is contemplated.


34. The sacrificial post of a rectangular, octagonal or circular shape should be placed in the middle of the tank.


35. Having worshipped the symbol of the lord, post made of the tree used for the purpose of sacrifice (should be driven) ten cubits into the ground in the case of (consecration of) a well [i.e., kūpa, kūpaka]. At the bottom of the post gold and fruit should be placed.


36. It should be driven into the ground in the middle of water fifteen cubits in the case of a well, twenty (cubits) in the case of a tank (puṣkariṇī) and twenty-five cubits in the case of a pond.


37. In the alternative, (the post) should be driven in the centre of the sacrificial bed and with the mantra yūpavraskā[36] cloth should be put around. The banner should be put at the top of the post.


38. Having worshipped it with perfumes etc., (the rite for)universal peace should be performed. The spiritual preceptor should be given the fees (in the form of) land, cows, gold and water vessel.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


bottom of page