🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 224 / Agni Maha Purana - 224 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 65
🌻. సభాగృహ స్థాపనము. - 3 🌻
''ఓం వసిష్ఠునిచే పాలింపబడిన ఓ నందా! ధనసంతానాదుల నొసగి నా ఆనందమును వృద్ధిపొందిపుము. ప్రజలకువిజయము నిచ్చు భార్గవనందినియైన జయా! నన్ను ధనసంపదలతో ఆనందింపచేయుము, అంగిరసుని పుత్రియైన ఓ పూర్ణా! నా మనోరథమునలు ఈడేర్పుము. నన్ను పరిపూర్ణకాముని చేయుము, కాశ్యపకుమారి యైన భద్రా! నా బుద్ధిని కల్యాణమయము చేయుము. అందరికిని ఆనందము నిచ్చు వసిష్ఠనందిని యైన నందా ! నీవు సమస్తబీజములతో, ఓషధులతో కూడి, సకలరత్నౌషధి పూర్ణురాలవై ఈ సుందర భవనమునందు ఆనలదపూర్వకముగ నివసింపుము.
కశ్యప్రజాపతిపుత్రివైన ఓ భద్రా ! నీవు సర్వవిధముల సుందర మైనదానవు, మహత్త్వము కలదానవు. సౌభాగ్యశాలినివి. ఉత్తమవ్రతమును పాలించుదానవు. నా ఇంటిలో ఆనందపూర్వకముగ నివసింపుము. దేవి! భార్గవీ! జయా! సర్వశ్రేష్ఠులైన ఆచార్యులు నిన్ను పూజించిరి. చందనపుష్పమాలాలంకృతురాల వైన నీవు ప్రపంచమునందలి సకలైశ్వర్యములను ఇచ్చుదానవు. నా గృహమునందు ఆనందపూర్వకముగ విహరింపుము. అంగిరసుని పుత్రి వైన పూర్ణా! నీవు అవ్యక్తరూపిణివి. ఓ ఇష్టకాదేవీ! నీవు నాకు అభిష్టవస్తువుల నిమ్ము. నా ఇంటిలో ఉండు మని కోరుచున్నాను. నీవు దేశప్రభువును గ్రామనగర ప్రభువులను, గృహప్రభువును అనుగ్రహించుదానవు. నా గృహమునందు జన-ధన-గజ-అశ్వ-గో-మహిష్యాదివృద్ధి కలుగు నట్లు చేయుము.
శ్రీ అగ్నిమహాపురాణమునందు సభాగృహస్థాపన మను అరువదియైదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 224 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 65
🌻The building of pavilions in front of the temples (sabhā-sthāpana) - 3 🌻
16-23. “Oṃ, O Mother Earth! related to Vasiṣṭha! you rejoice with the Vasus (semi-divine beings) and people. Glory be to the daughter of Bhārgava[2] (Śukra the preceptor of demons), the giver of success to her offsprings. The accomplished goddess! relative of Aṅgiras! You grant me my heart’s desire.
O auspicious one! related to (sage) Kaśyapa! make my intellect good. Endowed with all herbs! Surrounded by all gems and herbs! Shining one Joyous one! related to Vasiṣṭha! May you amuse here! Daughter of Prajāpati (Brahman)!
O Goddess! Handsome in all parts! Noble-minded! Beautiful one! The strict observer of disciplines! One who is related to Kaśyapa! May you enjoy in this house! O Adored by the great preceptors! Adorned with perfumes and garlands! Bestower of prosperity!
O Goddess! Daughter of Bhārgava! May you amuse in this house! The primordial element! The inexplicable one! Accomplished! O daughter of sage Aṅgiras! O Goddess of bricks! I establish you. You confer on me my desires! One surrounded by the lords of regions, place and the house! You be furtherer of men, wealth, elephant, horse and cow.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Kommentarer