🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 227 / Agni Maha Purana - 227 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 66
🌻. దేవ సముదాయ సాధారణ ప్రతిష్ఠా కథనము. - 3 🌻
పిదప శేషహోమము చేసి మూడు పూర్ణాహుతులు ఇవ్వవలెను. ''యుజ్ఞతే'' ఇత్యాద్యనువాకమును చదువుచు, ప్రణవముతో రావి ఆకుల విస్తరులో వడ్డించుకొని ఛరువును భక్షించవలెన. పిమ్మట మాసాధిపతుల నుద్దేశించి పండ్రెండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆచార్యుడు వారిలో పదమూడవవాడుగా ఉండవలెను. వారికి మధుర జలపూర్ణములగు పదమూడు కలశముల, ఉత్తమమైన ఛత్రము పాదుకలు. వస్త్రములు, సువర్ణము, మాలలు దానము చేయవలెను.
వ్రతపూర్తికి అన్ని వస్తువులు పదమూడు చొప్పున చేయవలెను. ''గోవులు ప్రసన్నములుగాక, సంతోషముతో నవిచరించుగాక, అని పలుకుచు గోపథమును (గోవులు మేయుటకు స్థానము) విడచిపదిహస్తముల ఎత్తైన యూపస్తంభము పాతవలెను. గృహస్థుడు ఇంటిలో హోమాదికార్యములన్నియు యథాశాస్త్రముగ జరిపి, పూర్వోక్త విధ్యనుసారము గృహములో ప్రవేశించవలెను. అందరికిని, ఏ అడ్డులును లేకుండ అన్నదానము చేయవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగ దక్షిణ లీయవలెను. ఉద్యానమును నిర్మించువాడు చిరకాలము నందనోద్యానములో నివసించును. మఠ ప్రదానము చేయుటచే స్వర్గలోక ఇంద్ర లోకములు ప్రాప్తించును ప్రపా (చలివెందలి) దానము చేసినవాడు వరుణలోకమునందును., సేతునిర్మాణము చేసినవాడు దేవలోకమునందును నివసించును. ఇటుకలతో సేతవు నిర్మించువాడు కూడ స్వర్గము పొందును. గోపథమును నిర్మించు వాడు గోలోకము పొందును. నియములను వ్రతములను ఆచరించువాడు సాక్షాద్విష్ణు స్వరూపుడగును కృచ్ఛ్రవ్రతములు చేయువాడు సమస్తపాపములను నశింపచేసికొనును గృహదానము చేసినవాడు మహాప్రలయము వరకును స్వర్గములో నివసించును. గృహస్థుడు శివాదిదేవతల సముదాయ ప్రతిష్ఠ చేయవలెను.
శ్రీ అగ్నిమహాపురాణనందు సాధారణ ప్రతిష్ఠాకథనమను అరువది యారవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 227 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 66
🌻Mode of consecration of other gods (sādhāraṇa-pratiṣṭhā) - 3 🌻
21. Having repeated the hymn yuñjate[11] the gruel should be partaken. With the praṇava (syllable oṃ) repeated at the end of the respective name the gruel should be placed in a vessel made of holy fig tree.
22. Then twelve brahmins (representing) the twelve presiding deities of the months should be fed. The priest (would be) the thirteenth. The thirteenth place should be offered to him.
23. Thirteen pitchers containing sweet water along with umbrellas, shoes, clothes, gold and garlands should be given to them for the sake of conclusion of the rite.
24. A path-way should be laid out (for the cattle) saying, “May the cows get pleased! May they move happily!” Then the sacrificial post should be planted there.
25-26. A water-shed in the pleasure grove, monastery and path-way should be of ten cubits. Having done the oblation etc. in the house duly in the prescribed way, the householder should enter the house according to the earlier injunctions. Offering of food etc. without any restrictions should be made on all these (occasions).
27. Fees should be paid by wise men to the brahmins according to one’s capacity. Whoever causes to set up a pleasure grove stays eternally in the garden of Indra.
28. One who builds a monastery goes to heaven and remains in the world of Indra. One who sets up a water-shed (lives) with Lord Varuṇa. By (the construction of) a pathway one remains in the heaven.
29. One who builds a bridge of bricks and who constructs a pathway for cows in the cattle stall and one who observes the austerities in the prescribed way dwells in the region of Viṣṇu. One who performs atonements gets rid of all sins.
30. Having constructed a house (for the god) one dwells in heaven so long as the universe exists. The installation and consecration of Lord Śiva etc., the lords of their edifices (have been described).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments